Virat Kohli: అన్‌బాక్సింగ్ కూడా చేయకుండానే కోహ్లీ కొత్త ఫోన్ మాయం.. జొమాటో అద్భుతమైన సలహా!
ABN, First Publish Date - 2023-02-07T17:07:26+05:30
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) ట్విట్టర్‌లో తాజాగా చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. అన్‌బాక్సింగ్ కూడా కాకుండానే తాను
ముంబై: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) ట్విట్టర్‌లో తాజాగా చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. అన్‌బాక్సింగ్ కూడా కాకుండానే తాను కొత్త ఫోన్‌ను పోగొట్టుకున్నానంటూ ఆ ట్వీట్‌లో కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘అన్‌బాక్సింగ్ కూడా చేయకుండానే కొత్త ఫోన్‌ను పోగొట్టుకుంటే అంతకుమించిన బాధ మరేమీ ఉండదు. మీరేమైనా నా ఫోన్‌ను చూశారా?’’ అని ఆ పోస్టులో విరాట్ రాసుకొచ్చాడు.
ఈ ట్వీట్ కాస్తా వైరల్ అవడంతో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో(Zomato) చమత్కారంగా ఓ మంచి సలహా ఇచ్చింది. మరేమీ ఆందోళన వద్దని వదిన (అనుష్క శర్మ) ఫోన్ నుంచి నిస్సంకోచంగా ఐస్ క్రీం ఆర్డర్ చేసుకోమని, అది ఉపయోగపడుతుందని సరదా సలహా ఇచ్చింది. ఈ ట్వీట్‌కు యూజర్ల నుంచి కామెంట్లు హోరెత్తుతున్నాయి.
ఇది ప్రమోషనల్ గిమ్మిక్కని కొందరంటే.. భాబీ (Anushka Sharma) స్విగ్గీ (Swiggy)ని ఉపయోగిస్తే పరిస్థితి ఏంటని మరికొందరు కామెంట్ చేశారు. మరో యూజర్ అయితే.. తొలుత భాబీ ఫోన్‌లోంచి ఆ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసేందుకు మొహమాట పడొద్దని, అలా చేస్తే ఉపయోగం ఉండొచ్చని కోహ్లీ సలహా ఇచ్చాడు. ‘‘మీరు కదా నిజమైన వ్యాపారులు. ప్రతికూల పరిస్థితుల్లోనూ గొప్ప ఐడియాలు వస్తాయి మీకు’’ అని మరో యూజర్ మండిపడ్డాడు.
Updated Date - 2023-02-07T17:07:27+05:30 IST