ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wahab Riaz: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ స్టార్ బౌలర్

ABN, First Publish Date - 2023-08-16T14:24:22+05:30

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు 38 ఏళ్ల వహాబ్ రియాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో వహాబ్ రియాజ్ 27 టెస్టులు, 91 ODIలు, 36 T20Iలు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో మొత్తం 237 వికెట్లు పడగొట్టాడు. 2020 డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో చివరిసారిగా పాకిస్థాన్ తరపున ఆడిన అతడు పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌కు తాత్కాలిక క్రీడా మంత్రిగా నియమితుడయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం రిటైర్మెంట్‌ల పర్వం కొనసాగుతోంది. ఇటీవల శ్రీలంక స్టార్ క్రికెటర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) టెస్టులకు వీడ్కోలు చెప్పగా.. అన్ని ఫార్మాట్లకు ఇంగ్లండ్ ఆటగాడు స్టీవ్ ఫిన్ (Steven Finn) రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా పాకిస్థాన్ స్టార్ బౌలర్ వహాబ్ రియాజ్ (Wahab Riaz) కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు 38 ఏళ్ల వహాబ్ రియాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ అతడు ధన్యవాదాలు తెలిపాడు. అంతర్జాతీయ కెరీర్‌లో వహాబ్ రియాజ్ 27 టెస్టులు, 91 ODIలు, 36 T20Iలు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో మొత్తం 237 వికెట్లు పడగొట్టాడు.

అయితే ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని వహాబ్ రియాజ్ చెప్పాడు. అత్యుత్తమ ప్రతిభావంతులతో కలిసి ఫ్రాంచైజీ క్రికెట్ అభిమానులను అలరిస్తానని హామీ ఇస్తున్నానని పేర్కొన్నాడు. 2020 డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో చివరిసారిగా పాకిస్థాన్ తరపున ఆడిన అతడు పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌కు తాత్కాలిక క్రీడా మంత్రిగా నియమితుడయ్యాడు. ఈ సందర్భంగా తన రిటైర్మెంట్ గురించి వహాబ్ రియాజ్ బుధవారం నాడు ట్వీట్ చేశాడు. 'అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. అద్భుతమైన ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నా. అంతర్జాతీయ క్రికెటర్‌గా తన ఎదుగుదలకు కృషి చేసిన పీసీబీ, తన కుటుంబం, కోచ్‌‌లు, మెంటార్స్, సహచర ఆటగాళ్లు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశాడు. గత రెండేళ్లుగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నానని.. తన దేశం తరఫున శక్తివంచన లేకుండా ఆడినట్లు పేర్కొన్నాడు. ఇకపై ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తానని రియాజ్ ట్వీట్ చేశాడు.

ఇది కూడా చదవండి: Kapil Dev: పాండ్యాపై సంచలన ఆరోపణలు.. ఆ ఫార్మాట్‌లో అతడు ఎందుకు ఆడడు?

కాగా వహాబ్ రియాజ్ పాకిస్థాన్ తరఫున 2011, 2015, 2019 వన్డే ప్రపంచకప్ ఆడాడు. 2010 ఆగస్టులో ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో పాక్ తరఫున 27 మ్యాచ్‌లు ఆడిన రియాజ్ 34.50 సగటుతో 83 వికెట్లు తీసాడు. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతతో పాటు మూడుసార్లు నాలుగు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 91 వన్డేల్లో 120 వికెట్లు తీసిన రియాజ్ 2011 ప్రపంచకప్‌లో మొహాలీ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై (5/46) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవం అని వహాబ్ రియాజమ్ తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు.

Updated Date - 2023-08-16T14:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising