West Indies: భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న మాజీ క్రికెటర్లు
ABN, First Publish Date - 2023-07-02T15:37:31+05:30
ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో వెస్టిండీస్ విఫలమైంది. దీంతో ఆ దేశ మాజీ క్రికెటర్లు భావోద్వేగానికి గురవుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. శనివారం నాడు స్కాట్లాండ్‌పై వెస్టిండీస్ ఓటమి చెందడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మాజీ క్రికెటర్లు ఇయాన్ బిషప్, డారెన్ సామీ, శామ్యూల్ బద్రీ, బ్రాత్‌వైట్ భావోద్వేగానికి గురై నిరాశగా కనిపించారు.
ఒకప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి మేటి జట్లను వణికించిన వెస్టిండీస్ (West Indies) క్రికెట్ టీమ్ ప్రస్తుతం దారుణమైన ప్రదర్శన చేస్తోంది. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్(ODI Worldcup)కు అర్హత సాధించడంలో వెస్టిండీస్ విఫలమైంది. దీంతో ఆ దేశ మాజీ క్రికెటర్లు భావోద్వేగానికి గురవుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. శనివారం నాడు స్కాట్లాండ్‌పై వెస్టిండీస్ ఓటమి చెందడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మాజీ క్రికెటర్లు ఇయాన్ బిషప్, డారెన్ సామీ, శామ్యూల్ బద్రీ, బ్రాత్‌వైట్ భావోద్వేగానికి గురై నిరాశగా కనిపించారు. కొందరు కన్నీళ్లు కూడా పెట్టుకోవడంతో వాళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: ప్రపంచకప్‌లో టీమిండియాకు అతడే కీలకం
కాగా ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ టోర్నీలో తొలుత జింబాబ్వే (Zimbabwe) చేతిలో వెస్టిండీస్ ఓటమి చవిచూసింది. అంతేకాకుండా నెదర్లాండ్స్‌పై భారీ స్కోరు చేసినా కాపాడుకోలేకపోయింది. సదరు మ్యాచ్ టైగా ముగియడంతో వన్ ఓవర్ ఎలిమినేటర్‌లో నెదర్లాండ్స్ ఏకంగా 30 పరుగులు చేసి వెస్టిండీస్‌ను ఓడించింది. ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్కాట్లాండ్(Scotland)పై తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 181 పరుగులు మాత్రమే చేసింది. తక్కువ స్కోరును కాపాడుకోవడంలో బౌలర్లు విఫలం కావడంతో వెస్టిండీస్ ఓడిపోయింది. దీంతో అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి దూరమైంది. కాగా 2018 నుంచే వెస్టిండీస్ (West Indies) జట్టు ప్రదర్శన పాతాళానికి పడిపోయిందని.. గత ఏడాది కూడా టీ20 ప్రపంచకప్(T20 Worldcup)కు అర్హత సాధించడంలో వెస్టిండీస్ విఫలమైన సంగతిని మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ గుర్తుచేశాడు.
Updated Date - 2023-07-02T15:37:31+05:30 IST