ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs WI: తొలి టెస్టు నుంచి తెలుగు తేజం ఔట్.. ఇద్దరు అరంగేట్రం..!!

ABN, First Publish Date - 2023-07-12T19:38:40+05:30

తొలి టెస్టుల్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా యషస్వీ జైశ్వాల్, ఇషాన్ కిషన్ అరంగేట్రం చేస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టుకు అంతా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. అంతేకాకుండా ఇద్దరు కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఈ మ్యాచ్ ద్వారా యషస్వీ జైశ్వాల్, ఇషాన్ కిషన్ అరంగేట్రం చేస్తున్నట్లు అతడు ప్రకటించాడు.

ఈ ఏడాది జనవరిలో రోడ్డుప్రమాదంలో రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడటంతో టీమిండియా తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌కు టెస్టుల్లో అవకాశం కల్పించింది. అయితే ఇప్పటివరకు 8 టెస్టులు ఆడిన భరత్ పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. కీపర్‌గా ఆకట్టుకున్నా బ్యాటింగ్‌లో తేలిపోయాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఇషాన్ కిషన్‌కు అవకాశం కల్పించింది. ఇప్పటివరకు టీ20ల్లో సత్తా చూపిన ఇషాన్ కిషన్ టెస్టుల్లో ఎలా రాణిస్తాడో చూడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Viral Video: రెండు చేతులు లేకపోయినా బౌలింగ్ వేస్తున్న యువకుడు..!!

మరోవైపు యువ క్రికెటర్ యషస్వీ జైశ్వాల్ ఐపీఎల్‌లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. సీనియర్ ఆటగాడు పుజారా స్థానంలో సెలక్టర్లు యషస్వీ జైశ్వాల్‌కు అవకాశం ఇవ్వగా తుది జట్టులో కూడా అతడికి చోటు ఖరారైంది. మరి వాల్ లేని లోటును అతడు పూడుస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. అతడి కోసం శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేస్తున్నట్లు రెండు రోజుల క్రితమే రోహిత్ ప్రకటించాడు. కాగా గత ఐదు టెస్టుల్లో భారత్ రెండు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. చివరి మూడు టెస్టుల్లో ఒక్క విజయం కూడా సాధించలేదు. ఆస్ట్రేలియాతో ఆడిన ఈ మూడింట్లో రెండు ఓడిపోగా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 సైకిల్‌లో టీమిండియాకు తొలి మ్యాచ్.

తొలి టెస్టుకు తుది జట్లు

భారత్: రోహిత్ (కెప్టెన్), ఆజింక్య రహానె, విరాట్ కోహ్లీ, యషస్వీ జైశ్వాల్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జైదేవ్ ఉనద్కట్, మహ్మద్ సిరాజ్

వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), తంగెనరిన్ చందర్‌పాల్, రేమాన్ రైఫర్, బ్లాక్‌వుడ్, అథనేజ్, జాసన్ హోల్డర్, జాషువా డిసిల్వ, కార్న్‌వాల్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, జోమెల్ వారికన్

Updated Date - 2023-07-12T19:49:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising