ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shubman Gill: ఐపీఎల్ తర్వాత గిల్‌కు ఏమైంది? వరుస వైఫల్యాలకు కారణమేంటి?

ABN, First Publish Date - 2023-09-04T16:30:50+05:30

ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరడంలో ఆ జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రధాన పాత్ర పోషించాడు. 17 మ్యాచ్‌లు ఆడి 890 పరుగులు చేశాడు. అతడు ఇదే జోరు కొనసాగిస్తే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా టైటిల్ విజేతగా నిలవడం పెద్ద కష్టమేమీ కాదని అందరూ అభిప్రాయపడ్డారు. దీంతో సెలక్టర్లు కూడా మూడు ఫార్మాట్లలోనూ అతడికి అవకాశాలు కట్టబెట్టారు. అయితే దాదాపు రెండు నెలలు గడిచిన తర్వాత సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది.

ఈ ఏడాది ఐపీఎల్‌ వంటి మెగా లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున వరుస సెంచరీలతో దుమ్మురేపిన లిటిల్ ప్రిన్స్ శుభ్‌మన్ గిల్ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తేలిపోతున్నాడు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, వెస్టిండీస్ పర్యటనల్లో అంచనాల మేరకు రాణించలేదు. అడపాదడపా ఒకట్రెండు హాఫ్ సెంచరీలు మినహా సాధికారికంగా అయితే ఆడలేకపోయాడు. ఇప్పుడు ఆసియా కప్‌లోనూ కీలకమైన పాకిస్థాన్ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఇలాగైతే వన్డే ప్రపంచకప్‌లో అతడిని జట్టులో కొనసాగిస్తారా లేదా పక్కనపెట్టేస్తారా అన్న పాయింట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు గిల్‌కు ఏమైందని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరడంలో ఆ జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రధాన పాత్ర పోషించాడు. 17 మ్యాచ్‌లు ఆడి 890 పరుగులు చేశాడు. యావరేజ్ దాదాపు 60. అతడు ఇదే జోరు కొనసాగిస్తే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా టైటిల్ విజేతగా నిలవడం పెద్ద కష్టమేమీ కాదని అందరూ అభిప్రాయపడ్డారు. దీంతో సెలక్టర్లు కూడా మూడు ఫార్మాట్లలోనూ అతడికి అవకాశాలు కట్టబెట్టారు. అయితే దాదాపు రెండు నెలలు గడిచిన తర్వాత సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. గిల్ జట్టుకు పెద్ద భారంగా మారినట్లు విమర్శలు వస్తున్నాయి. అతడి ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో అయితే 32 బంతులు ఆడి కేవలం పది పరుగులే చేసి అవుటయ్యాడు. ఏ దశలోనూ గిల్ కాన్ఫిడెంట్‌గా కనిపించలేదు.

ఇది కూడా చదవండి: Asia Cup 2023: నేపాల్‌కు బీర్ కంపెనీ బంపర్ ఆఫర్.. టీమిండియాపై రెచ్చిపోతారా?

ముఖ్యంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడటంతో శుభ్‌మన్ గిల్ ఒత్తిడికి లోనైన మాట వాస్తవమే అయినా అతడి బ్యాటింగ్‌లో లోపాన్ని కూడా అంగీకరించి తీరాలి. ఈ మ్యాచ్‌లో గిల్ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ కూడా స్పందించాడు. అతడి బ్యాటింగ్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. లేకపోతే అతడు ఇలాగే విఫలమవుతుంటాడని గంభీర్ హెచ్చరించాడు. బ్యాట్, ప్యాడ్ మధ్య అంత గ్యాప్ వదలడం మాత్రం కరెక్ట్ కాదన్నాడు. భవిష్యత్‌లో గిల్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆడాలని సలహా ఇచ్చాడు. ఒత్తిడికి లోనుకాకుండా తన సహజసిద్ధమైన ఆటను ఆడాలని సూచించాడు.

Updated Date - 2023-09-04T16:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising