ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND Vs AUS: తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్.. ఐదు వికెట్లతో రాణించిన షమీ

ABN, First Publish Date - 2023-09-22T17:43:16+05:30

భారత్-ఆస్ట్రేలియా మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి వన్డే ఆసక్తికరంగా సాగుతోంది. 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌటైంది.

మొహాలీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. అయితే ప్రారంభంలోనే ఆ జట్టు కష్టాల్లో పడింది. నాలుగు పరుగులకే మిచెల్ మార్ష్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత సీనియర్ ఆటగాళ్లు వార్నర్, స్మిత్ ఆచితూచి ఆడారు. వార్నర్ హాఫ్ సెంచరీ(52)తో రాణించగా స్మిత్ 41 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. లబుషేన్ (39), కామెరూన్ గ్రీన్ (31), జోష్ ఇంగ్లీస్ (45) రాణించారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో రాణించాడు. బుమ్రా 10 ఓవర్లలో రెండు మెయిడెన్‌లు సహా 43 పరుగులు ఇచ్చాడు. అతడికి ఒక్క వికెట్ మాత్రమే దక్కింది. శార్దూల్ ఠాకూర్ తీవ్రంగా నిరాశపరిచాడు. 10 ఓవర్లలో 78 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా తలో వికెట్ సాధించారు.

ఇది కూడా చదవండి: IND Vs AUS: టీమిండియాపై విమర్శల వర్షం.. సిరాజ్‌ను ఎందుకు తీసుకోలేదు?

మరోవైపు ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో చాలా సింపుల్ క్యాచ్‌ నేలపాలైంది. టీమిండియాలో మంచి ఫీల్డర్లలో ఒకడిగా పేరున్న శ్రేయాస్ అయ్యర్.. తన చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు. అది కూడా ప్రమాదకరమైన డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్ కావడంతో అభిమానులు మండిపడుతున్నారు. శ్రేయాస్ అయ్యర్ వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్క మ్యాచ్ ఆడి ఫిట్‌నెస్ కోల్పోయే ఆటగాడు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. వార్నర్ వంటి డేంజర్ బ్యాటర్ ఈజీ క్యాచ్ ఇస్తే నేలపాలు చేశాడని.. దీంతో అతడు హాఫ్ సెంచరీ చేశాడని నెటిజన్‌లు మండిపడుతున్నారు.

Updated Date - 2023-09-22T17:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising