ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup 2023: టీమిండియాలో నాలుగో స్థానం ఎవరిది?

ABN, First Publish Date - 2023-07-05T18:13:05+05:30

మూడు నెలల్లో ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో తలపడాల్సిన భారత్ వన్డేల్లో మెరుగైన ఆట ఆడాల్సి ఉంది. అయితే జట్టును వేధిస్తున్న ప్రధాన సమస్య బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానం. ఓపెనర్లుగా రోహిత్, గిల్.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ స్థానాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. కానీ నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కు వస్తారో మాత్రం ప్రశ్నగానే మిగులుతోంది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తున్నా కేఎల్ రాహుల్‌తో పాటు వికెట్ కీపర్ కోటాలో వాళ్లు ఎంపిక అవుతారా అంటే ఆలోచించాల్సిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రికెట్‌లో ఉన్న మూడు ఫార్మాట్లలో టీమిండియా ప్రస్తుతం రెండు ఫార్మాట్లలో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో ఓడిపోయినా టెస్టుల్లో నంబర్‌వన్‌గానే ఉంది. అటు సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉంటున్నా టీ20ల్లోనూ భారత జట్టే నంబర్‌వన్. అయితే వన్డేల్లో మాత్రం భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ గెలవాలని ఆశపడుతున్న టీమిండియాకు ఇది నిరాశ కలిగించే విషయమే. మరో మూడు నెలల్లో మెగా టోర్నీలో తలపడాల్సిన భారత్ వన్డేల్లో మెరుగైన ఆట ఆడాల్సి ఉంది. అంతకంటే ముందు జట్టులోని లోపాలను, సమస్యలను పరిష్కరించుకోవాలి.

ఇది కూడా చదవండి: ముగ్గురు భారత ఆటగాళ్లకు చెక్ పెట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్

అయితే జట్టును వేధిస్తున్న ప్రధాన సమస్య బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానం. ఓపెనర్లుగా రోహిత్, గిల్.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ స్థానాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. కానీ నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కు వస్తారో మాత్రం ప్రశ్నగానే మిగులుతోంది. సాధారణంగా శ్రేయాస్ అయ్యర్ ఈ స్థానంలో ఆడాలి. కానీ అతడు గాయం కారణంగా కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఎప్పుడు ఫిట్‌ అవుతాడో అన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో అనుభవజ్ఞుడైన ఆటగాడి కోసం టీమిండియా చూస్తోంది. ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే సిరీస్‌లో నాలుగో స్థానంలో యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించగా అతడు వరుసగా విఫలమై నిరాశను మిగిల్చాడు.

శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ కాకుండా నాలుగో స్థానంలో ఆడేవాళ్లు కనిపించడం లేదు. ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. రిషబ్ పంత్ కూడా టీమ్‌కు అందుబాటులో లేకపోవడంతో ప్రపంచకప్‌లో టీమిండియా ఎవరిని ఆడిస్తుందో అన్న విషయం అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. సంజు శాంసన్ లాంటి యువ ఆటగాడిని తీసుకోవాలంటే వికెట్ కీపర్ కోటాలో ఎంపిక చేయాల్సి ఉంటుంది. నాలుగో స్థానానికి మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ప్రత్యామ్నాయంగా కనిపిస్తు్న్నాడు. ఇప్పటికే టీమ్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా సేవలు అందిస్తున్నాడు. అతడు ఉండగా మరో వికెట్ కీపర్‌కు సెలక్టర్లు జట్టులో స్థానం కల్పిస్తారో లేదో వేచి చూడాలి.

Updated Date - 2023-07-05T18:13:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising