ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IPL 2024: అసలు సమీర్ రిజ్వీ ఎవరు? వేలంలో ఎందుకు కోట్లు కుమ్మరించారు?

ABN, Publish Date - Dec 20 , 2023 | 02:50 PM

IPL 2024: ఐపీఎల్ వేలంలో అన్‌క్యాప్డ్ ఆటగాడు సమీర్ రిజ్వీకి బంపర్ జాక్‌పాట్ తగిలింది. అతడిని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.8.4 కోట్లకు సొంతం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ ఆడని ఆటగాళ్లలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా సమీర్ రిజ్వీ రికార్డు స‌ృష్టించాడు. ఈ నేపథ్యంలో అసలు సమీర్ రిజ్వీ ఎవరు అని.. అతడి కోసం చెన్నై లాంటి ప్రతిష్టాత్మక జట్టు కోట్లు కుమ్మరించడమేంటని చర్చించుకుంటున్నారు.

ఐపీఎల్ వేలంలో అన్‌క్యాప్డ్ ఆటగాడు సమీర్ రిజ్వీకి బంపర్ జాక్‌పాట్ తగిలింది. అతడిని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.8.4 కోట్లకు సొంతం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ ఆడని ఆటగాళ్లలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా సమీర్ రిజ్వీ రికార్డు స‌ృష్టించాడు. ఈ నేపథ్యంలో అసలు సమీర్ రిజ్వీ ఎవరు అని.. అతడి కోసం చెన్నై లాంటి ప్రతిష్టాత్మక జట్టు కోట్లు కుమ్మరించడమేంటని చర్చించుకుంటున్నారు. అయితే ఈ 20 ఏళ్ల యువ ఆటగాడి సత్తా ఏంటో చాలా మందికి తెలియదు. సమీర్ రిజ్వీ యూపీ టీ20 లీగ్‌లో కాన్పూర్ సూపర్ స్టార్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు అతడి పేరిటే ఉండటం గమనించాల్సిన విషయం.

దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతుండటంతో సమీర్ రిజ్వీ ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికాడు. యూపీ టీ20 లీగ్‌లో ఆడిన 9 ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు చేశాడు. అందుకు అతడు ధోనీ ఉన్న జట్టు దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు ధోనీ నాయకత్వంలో ఆడే అవకాశం రావడంతో అతడు రాటుదేలే అవకాశం ఉంది. అంతేకాకుండా సమీర్ రిజ్వీని రైట్ హ్యాండెడ్ సురేష్ రైనా అని చాలా మంది పిలుస్తారు. రోహిత్ శర్మలా పుల్ షాట్లను సులభంగా బాదగలడు. మరోవైపు రింకూ సింగ్‌లా మ్యాచ్‌ను ఫినిష్ చేయగలడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సమీర్ రిజ్వీ 139.89 స్ట్రైకింగ్‌తో బ్యాటింగ్ చేశాడు. అతడు ఎదుర్కొన్న ప్రతి 11 బంతుల్లో ఒక సిక్సర్ కొట్టాడు. అందుకే సమీర్ రిజ్వీకి వేలంలో కోట్లు కుమ్మరించారు. పలు ఫ్రాంచైజీలు అతడి కోసం పోటీపడగా చివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 20 , 2023 | 03:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising