Gujarat Titans: హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? రేసులో ఉన్నదెవరు?
ABN, First Publish Date - 2023-11-28T17:56:34+05:30
IPL 2024: వచ్చే సీజన్ కోసం కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్‌కు బదిలీ చేసిన గుజరాత్ జట్టు డిసెంబర్ 19న జరిగే వేలంలో ఆల్‌రౌండర్‌ను తీసుకునే అంశంపై దృష్టి సారించింది. పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం తీవ్రంగా ప్రయత్నించనుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యంగా నలుగురు ఆటగాళ్లను టార్గెట్ చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వచ్చే ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కొత్తగా కనిపించనుంది. తొలి సీజన్‌లో ఛాంపియన్‌గా, రెండో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ జట్టు మూడో సీజన్‌లో ఎలా ఆడబోతుందన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గుజరాత్ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్‌కు బదిలీ చేసిన గుజరాత్ జట్టు డిసెంబర్ 19న జరిగే వేలంలో ఆల్‌రౌండర్‌ను తీసుకునే అంశంపై దృష్టి సారించింది. పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం తీవ్రంగా ప్రయత్నించనుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యంగా నలుగురు ఆటగాళ్లను టార్గెట్ చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వీళ్లలో స్వదేశీ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు.
గుజరాత్ టార్గెట్ చేయబోయే నలుగురు ఆటగాళ్ల విషయానికి వస్తే.. ఈ జాబితాలో రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, ఒమర్ జాయ్, షారుఖ్ ఖాన్ ఉన్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించాడు. దీంతో పాండ్య స్థానంలో అతడు మంచి ఛాయిస్ కానున్నాడు. రచిన్ రవీంద్ర కోసం మిగతా ఫ్రాంచైజీలు కూడా గట్టిగానే పోటీ పడతాయని అందరూ భావిస్తున్నారు. రచిన్ రవీంద్ర మినీ వేలంలో ఎంత ధర పలుకుతాడో వేచి చూడాల్సిందే. మరోవైపు గత ఏడాది బాల్‌తో, బ్యాట్‌తో రాణించిన శార్దూల్ ఠాకూర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ వేలంలోకి విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ కూడా మంచి ఛాయిస్ అని గుజరాత్ భావిస్తున్నట్లు సమాచారం. ఆప్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ ఒమర్ జాయ్ కూడా వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటుకున్నాడు. అతడిపైనా గుజరాత్ ఫ్రాంచైజీ దృష్టి సారించే అవకాశం ఉంది. ఇక ఫినిషర్ పాత్ర పోషించాలంటే షారుఖ్ ఖాన్‌ను కూడా పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అతడు ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో ఫినిషర్‌గా మంచి ప్రదర్శన చేశాడు. మొత్తానికి గుజరాత్ టైటాన్స్ జట్టులో హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరో తెలుసుకోవాలంటే డిసెంబర్ 19 వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-28T17:56:35+05:30 IST