ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WPL 2023: హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే?

ABN, First Publish Date - 2023-03-14T21:25:37+05:30

వికెట్ కీపర్ యస్తికా భాటియా(44) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు హర్మన్‌ప్రీత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: వికెట్ కీపర్ యస్తికా భాటియా(44) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఒక్క పరుగు వద్దే హేలీ మాథ్యూస్ (0)ను తొలి వికెట్‌గా కోల్పోయింది. అయితే, నట్ స్కివెర్ బ్రంట్ (36), హర్మన్‌ప్రీత్ కౌర్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. నట్ స్కివర్, యస్తికా భాటియా 9 పరుగుల తేడాతో పెవిలియన్ చేరినప్పటికీ క్రీజులో పాతుకుపోయిన హర్మన్‌ప్రీత్ జాగ్రత్తగా ఆడుతూ స్కోరుపెంచే ప్రయత్నం చేసింది.

అయితే, ఆ తర్వాతి బ్యాటర్లు ఆమెకు అండగా నిలవడంలో విఫలమయ్యారు. ఒకరి తర్వాత ఒకరిగా పెవిలియన్‌కు క్యూకట్టారు. దీంతో ముంబై 162 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అమెలియా కెర్ 19 పరుగులు చేసింది. యస్తికా భాటియా 37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 44 పరుగులు చేయగా, హర్మన్‌ప్రీత్ 30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ (51 పూర్తి చేసుకుంది. జట్టులో ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. వీరిలో ఇద్దరు ఖాతా తెరవకుండానే అవుటయ్యారు. గుజరాత్ బౌలర్లలో ఆష్లీ గార్డనర్‌కు మూడు వికెట్లు దక్కాయి.

Updated Date - 2023-03-14T21:25:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising