ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WPL 2023: టాస్ గెలిచిన యూపీ.. ముంబై జోరుకు బ్రేకులు పడేనా?

ABN, First Publish Date - 2023-03-12T19:24:03+05:30

మహిళల ప్రీమియర్ లీగ్ లో మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. వరుస విజయాలతో మంచి జోరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians)- విజయాల రుచి చూసిన యూపీ వారియర్స్(UP Warriorz) తలపడబోతున్నాయి. టాస్ గెలిచిన యూపీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గిన హర్మన్‌ప్రీత్ సేన 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో విజయం సాధించిన యూపీ 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి అగ్రస్థానాన్ని పదిలంగా ఉంచుకోవాలని ముంబై భావిస్తుండగా, ముంబై విజయాల జోరుకు కళ్లెం వేయాలని యూపీ పట్టుదలగా ఉంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న హర్మన్‌ప్రీత్ సేన(Harmanpreet Team) ప్రత్యర్థిని 160 పరుగుల్లోపు ఆలౌట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని, ఇది ప్రయోగాలకు సమయం కాదని హర్మన్ పేర్కొంది. యూపీ కెప్టెన్ అలిస్సా హీలీ(Alyssa Healy) మాత్రం ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని భావిస్తున్నట్టు చెప్పింది. అదే జరిగితే ఆ తర్వాత ప్రత్యర్థిని నిలువరిస్తామని పేర్కొంది. హారిస్ స్థానంలో షబ్నిమ్ ఇస్మాయిల్‌కు తుది జట్టులో స్థానం లభించినట్టు వివరించింది.

Updated Date - 2023-03-12T19:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising