ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WPL Auction: వేలంలో ఇంగ్లండ్ కెప్టెన్‌కు నిరాశ.. షెఫాలీకి రూ. 2 కోట్లు

ABN, First Publish Date - 2023-02-13T17:07:21+05:30

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) కోసం ముంబై వేదికగా జరుగుతున్న వేలంలో ఇంగ్లండ్ కెప్టెన్ హెదర్ నైట్‌(Heather Knight )కు తీవ్ర నిరాశ ఎదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) కోసం ముంబై వేదికగా జరుగుతున్న వేలంలో ఇంగ్లండ్ కెప్టెన్ హెదర్ నైట్‌(Heather Knight )కు తీవ్ర నిరాశ ఎదురైంది. రూ. 40 లక్షల బేస్ ప్రైజ్‌లో ఉన్న ఆమెను కొనుగోలు చేసేందుకు ఒక్క ఫ్రాంచైజీ కూడా ముందుకు రాకపోవడంతో అన్‌‌సోల్డ్‌గానే మిగిలిపోయింది. అలాగే, దక్షిణాఫ్రికా క్రికెటర్ తజ్మిన్ బ్రిట్స్‌(Tazmin Brits) కూడా అన్‌సోల్డ్‌గానే మిగిలిపోయింది.

టీమిండియా యువ ప్లేయర్, అండర్-19 విన్నింగ్ కెప్టెన్ షెఫాలీ వర్మ(Shefali Verma)ను ఢిల్లీ కేపిటల్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే, ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ అందించిన ఆ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్‌(Meg Lanning)ను రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్‌(Jemimah Rodrigues)ను రూ. 2.20 కోట్లకు డీసీ కొనుగోలు చేసింది.

ఇంగ్లండ్ ప్లేయర్ సోఫియా డంక్లీ(Sophia Dunkley)ని గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) రూ. 60 లక్షలకు కొనుగోలు చేయగా, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమిలియా కెర్‌(Amelia Kerr)ను ముంబై ఇండియన్స్ మూడో ప్లేయర్‌గా కోటి రూపాయలకు సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా పేసర్ షబ్నమ్ ఇస్మాయిల్‌(Shabnim Ismail) కోసం యూపీ వారియర్జ్ కోటి రూపాయలు వెచ్చించగా, ఆస్ట్రేలియా స్టార్ బెత్ మూనీని గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లకు దక్కించుకుంది.

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ తహిలా మెక్ గ్రాత్‌ను యూపీ వారియర్జ్ రూ. 1.4 కోట్లతో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నట్ స్కివెర్ బ్రంట్‌ను 3.2 కోట్లకు తీసుకుంది. ఇండియన్ పేసర్ రేణుక సింగ్ కోసం ఆర్సీబీ మరోమారు పెద్దమొత్తంలో ఖర్చు చేసింది. ఆమెను రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కోసం యూపీ వారియర్జ్ భారీగా ఖర్చు చేసింది. ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్‌తో పోటీపడి రూ. 2.6 కోట్లకు ఆమెను దక్కించుకుంది. దీప్తిని రూ. 2 కోట్లకు ముంబై దక్కించుకోవాలని చూసినప్పటికీ యూపీ వారియర్జ్ పోటీపడి మరింత ఎక్కువకు కొనుగోలు చేసింది.

ఇప్పటి వరకు ఎవరు ఎవరిని కొనుగోలు చేశారంటే?

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎల్లిస్ పెర్రీ, రేణుక సింగ్

గుజరాత్ జెయింట్స్: ఆష్లీ గార్డ‌నర్, బెత్ మూనీ, సోఫియా డంక్లీ

ఢిల్లీ కేపిటల్స్: జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ

ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్ కౌర్, నట్ స్కివెర్ బ్రంట్, అమెలియా కెర్

యూపీ వారియర్జ్: సోపీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ, తహ్లియా మెక్ గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్

Updated Date - 2023-02-13T17:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising