ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తడబడిన జట్టును ఆదుకున్న డియోల్.. యూపీ వారియర్జ్ లక్ష్యం ఎంతంటే?

ABN, First Publish Date - 2023-03-05T21:23:56+05:30

డబ్ల్యూపీఎల్‌(WPL)లో భాగంగా యూపీ వారియర్జ్‌(UP Warriorz)తో జరుగుతున్న మ్యాచ్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నవీ ముంబై: డబ్ల్యూపీఎల్‌(WPL)లో భాగంగా యూపీ వారియర్జ్‌(UP Warriorz)తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌ తొలుత జోరుగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన, సోఫియా డంక్లీ దూకుడుగా ఆడుతున్నట్టు కనిపించారు. అయితే 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన సోఫియా‌ను దీప్తి శర్మ బౌల్డ్ చేయడంతో 34 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

ఇక ఆ తర్వాతి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడినట్టు కనిపించింది. చూస్తుంటే శనివారం నాటి సీన్ రిపీటవుతుందని అనిపించింది. అయితే, హర్లీన్ డియోల్ క్రీజులో పాతుకుపోయి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసింది. సహచర బ్యాటర్లు ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా ఏకాగ్రత కోల్పోని హర్లీన్ స్కోరు పెంచే ప్రయత్నం చేసింది. మొత్తం 32 బంతులు ఎదుర్కొన్న హర్లీన్ 7 ఫోర్లతో 46 పరుగులు చేసి 18 ఓవర్లో అవుటైంది.

ఆష్లీ గార్డనర్ 25, దయాళన్ హేమలత 21 పరుగులు చేశారు. అన్నాబెల్ సుదర్‌లాండ్ (8), సుష్మా వర్మ (9) నిరాశ పరిచారు. అప్పటి వరకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన యూపీ బౌలర్లు ఆఖర్లో కట్టుతప్పారు. చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకోవడంతో గుజరాత్‌కు భారీ స్కోరు సాధ్యమైంది. యూపీ వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Updated Date - 2023-03-05T21:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising