Yashasvi Jaiswal: ఐపీఎల్‌పై యషస్వీ జైశ్వాల్ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-07-01T16:33:51+05:30
ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరఫున మెరుపు ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన జైశ్వాల్ ఏకంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. త్వరలో వెస్టిండీస్ పర్యటనలో రెండు టెస్టుల కోసం ప్రకటించిన టీమిండియాలో సీనియర్ ఆటగాడు పుజారా స్థానంలో జైశ్వాల్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. అయితే ఐపీఎల్ లాంటి మెగా క్రికెట్ లీగ్‌లోనూ స్లెడ్జింగ్ జరుగుతోందని జైశ్వాల్ అన్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajastan Royals) తరఫున నిలకడగా రాణించిన క్రికెటర్ ఎవరు అంటే యషస్వీ జైశ్వాల్ (Yashasvi Jaiswal) మాత్రమే. ఆడిన 14 మ్యాచ్‌లలో 625 పరుగులతో రాణించాడు. అందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. మెరుపు ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన జైశ్వాల్ ఏకంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. త్వరలో వెస్టిండీస్ పర్యటనలో రెండు టెస్టుల కోసం ప్రకటించిన టీమిండియా(Team India)లో సీనియర్ ఆటగాడు పుజారా స్థానంలో జైశ్వాల్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. అయితే ఐపీఎల్ (IPL)పై జైశ్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇది కూడా చదవండి: టెస్టుల్లో ఇంగ్లండ్ దృక్పథం ఇంతేనా? మోర్గాన్ ఏమంటున్నాడు?
సాధారణంగా క్రికెట్‌లో పలువురు ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేస్తుంటారు. తద్వారా ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీస్తారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ఐపీఎల్ లాంటి మెగా క్రికెట్ లీగ్‌లోనూ స్లెడ్జింగ్ జరిగిందని యషస్వీ జైశ్వాల్ (Yashasvi Jaiswal) ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే మైదానంలో ప్రత్యర్థులు స్లెడ్జింగ్ చేస్తే నోటితో కాకుండా తాను ఆటతో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తానని జైశ్వాల్ తెలిపాడు. ఆటలోనే కాకుండా నిజజీవితంలోనూ ఎవరైనా పరుషంగా మాట్లాడినా తాను పట్టించుకోనని అన్నాడు. స్లెడ్జింగ్ ఎక్కడైనా జరుగుతుందని.. కానీ అది బయటవారికి తెలియదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
Updated Date - 2023-07-01T16:53:50+05:30 IST