ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yuvraj Singh: యువరాజ్ సంచలన వ్యాఖ్యలు.. టీమిండియాకు అంత సీన్ లేదు

ABN, First Publish Date - 2023-07-11T16:44:33+05:30

టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది జరిగే ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలుస్తుందన్న నమ్మకం తనకు లేదని యువరాజ్ అన్నాడు. దీనికి కారణాలను కూడా యువరాజ్ వివరించాడు. ప్రస్తుతం టీమిండియా మిడిలార్డర్ చాలా బలహీనంగా ఉందని.. కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచి చాలా ఏళ్లు అవుతోంది. దీంతో ఈ ఏడాది సొంతగడ్డపై అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా గెలవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది జరిగే ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలుస్తుందన్న నమ్మకం తనకు లేదని యువరాజ్ అన్నాడు. దీనికి కారణాలను కూడా యువరాజ్ వివరించాడు.

ప్రస్తుతం టీమిండియా మిడిలార్డర్ చాలా బలహీనంగా ఉందని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో యువరాజ్ వ్యాఖ్యానించాడు. కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు. ఓ దేశ భక్తుడిగా ఇండియా గెలుస్తుందని చెప్పవచ్చని.. నిజాయితీగా చెప్పాలంటే మన జట్టు ప్రపంచకప్ గెలుస్తుందన్న నమ్మకం లేదన్నాడు. ప్రస్తుత జట్టు పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరించాడు.

ఇది కూడా చదవండి: Rohit Sharma: రోహిత్‌పై వేలాడుతున్న కత్తి.. టెస్ట్ పాసవుతాడా?

రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నట్లు యువరాజ్ గుర్తుచేశాడు. గాయాల కారణంగా మిడిలార్డర్‌లో సరైన ఆటగాళ్లు కనిపించడం లేదన్నాడు. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ కూడా గెలవకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందన్నాడు. అయితే నిజాలు ఒప్పుకోక తప్పదని.. ఇప్పటికైనా జట్టు ఎంపిక తీరు మారాలని సూచించాడు. టీమ్ కాంబినేషన్ సరిగ్గా ఉండేలా సెలక్టర్లు చర్యలు తీసుకోవాలని యువరాజ్ హితవు పలికాడు. నాలుగో స్థానంలో ఇప్పటికీ సరైన బ్యాటర్ లేడని.. ఈ సమస్య టీమిండియాకు పెద్ద టాస్క్ అని అభిప్రాయపడ్డాడు. రింకూ సింగ్ చాలా బాగా ఆడుతున్నాడని.. ప్రపంచకప్ గెలవాలంటే రింకూ సింగ్‌కు అవకాశం ఇచ్చి తగినన్ని మ్యాచ్‌లు ఆడేలా చర్యలు తీసుకోవాలన్నాడు. అతడు లోయరార్డర్ బ్యాటర్లతో మంచి భాగస్వామ్యాలు ఏర్పర్చగలడని యువీ అన్నాడు. అటు టాపార్డర్‌లో రోహిత్ కూడా నిలకడగా ఆడటం లేదని.. అతడిలో అపార ప్రతిభ ఉంది కాబట్టి ప్రపంచ కప్ నాటికి ఫామ్‌లోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు యువరాజ్ తెలిపాడు.

Updated Date - 2023-07-11T16:45:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising