ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wrestling Body Chief:కేసులు నమోదయ్యాక బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బలప్రదర్శన

ABN, First Publish Date - 2023-04-29T10:54:22+05:30

మహిళా రెజ్లర్ల ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశాక రెజ్లింగ్ బాడీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ తన పార్టీ అనుచరులతో కలిసి బలప్రదర్శన...

Wrestling Body Chief Brij Bhushan Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్ల ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశాక రెజ్లింగ్ బాడీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ తన పార్టీ అనుచరులతో కలిసి బలప్రదర్శన చేశారు.(Brij Bhushan Singh) తనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని బ్రిజ్ భూషణ్ స్వాగతించారు. తన రాజకీయ, వృత్తి జీవితంలో అత్యంత కఠినమైన యుద్ధాన్ని ఎదుర్కొంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తన సొంత గడ్డ అయిన గోండా జిల్లాలో బ్రిజ్ భూషణ్ కు(Wrestling Body Chief) మద్ధతుదారులు పూలమాలలు వేశారు.

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఫిర్యాదులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ తనకు ఇంకా అందలేదని, అది అందే వరకూ తాను దీనిపై వ్యాఖ్యానించబోనని చెప్పారు. ‘‘న్యాయవ్యవస్థ నిర్ణయం పట్ల నేను సంతోషిస్తున్నాను. ఢిల్లీ పోలీసులు తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తారు, వారికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను...ఈ దేశంలో న్యాయవ్యవస్థ కంటే ఎవరూ పెద్దవారు కాదు, నేను సుప్రీంకోర్టు ఉత్తర్వును స్వాగతిస్తున్నాను’’అని సింగ్ చెప్పారు.

ఇది కూడా చదవండి : Wrestlers protest :జంతర్ మంతర్‌కు వచ్చిన ప్రియాంకగాంధీ...రెజ్లర్లకు ఆందోళనకు మద్ధతు

గోండాలోని బ్రిజ్ భూషణ్ సింగ్ నివాసానికి బీజేపీ ఎమ్మెల్యేలు భారీగా తరలివచ్చారు.(Show Of Strength) సింగ్ పై వచ్చిన ఆరోపణలు నిరాధారం అని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఇది అధికార పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, మరి కొందరు పారిశ్రామికవేత్తల కుట్ర అని బీజేపీ నేతలు ఆరోపించారు.‘‘ఇది మల్లయోధుల నిరసన కాదు. ఇది ముందుగా ప్లాన్ చేసిన కార్యక్రమం’’ అని గోండాలోని కల్నల్‌గంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అజయ్ ప్రతాప్ సింగ్ అన్నారు.

ఇది కూడా చదవండి : Shraddha Walkar case : శ్రద్ధావాకర్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు నేడు

ఫెడరేషన్ చీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు కమిటీ దోషిగా ఏమీ కనుగొనలేదని కూడా ఆయన పేర్కొన్నారు. అగ్రశ్రేణి రెజ్లర్లు పదేపదే డిమాండ్ చేసిన తర్వాత కూడా పర్యవేక్షణ కమిటీ నివేదిక ప్రజలకు విడుదల చేయకపోవడం గమనార్హం.బ్రిజ్ భూషణ్ సింగ్ రాజకీయ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని సింగ్ నివాసంలో ఉన్న బలరాంపూర్ ఎమ్మెల్యే పాల్తురామ్ అన్నారు.బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు కేసులు పెట్టారు.

Updated Date - 2023-04-29T10:58:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising