Rajasthan vs Delhi: ఢిల్లీ కథ మారలేదు.. రాజస్థాన్‌కు వరుసగా రెండో విజయం
ABN, First Publish Date - 2023-04-08T19:53:21+05:30
అసోంలోని గువహటి వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (Rajasthan Royals vs Delhi Capitals) మ్యాచ్‌లో పర్యాటక వార్నర్ సేన మరో ఓటమిని మూటగట్టుకుంది.
గువహటి: అసోంలోని గువహటి వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (Rajasthan Royals vs Delhi Capitals) మ్యాచ్‌లో పర్యాటక వార్నర్ సేన మరో ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోవడంతో హ్యాట్రిక్ ఓటమిని ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. 57 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. 200 పరుగుల భారీ లక్ష్య చేధనలో కెప్టెన్ డేవిడ్ వార్నర్, లలిత్ యాదవ్ మినహా మిగతావారెవరూ రాణించకపోవడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఇక రాజస్థాన్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్ట ఢిల్లీని ఇబ్బందుల్లోకి నెట్టారు. ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్ చెరో 3 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 2, సందీప్ శర్మ 1 చొప్పున వికెట్లు తీశారు.
అయితే టార్గెట్ ఛేజింగ్‌లో ఒకవైపు వికెట్లు పడుతున్నా వార్నర్ మాత్రం క్రీజులో ఎక్కువసేపు కొనసాగాడు. అయినప్పటికీ మ్యాచ్‌ను గెలిపించడం అతడికి సాధ్యపడలేదు. ఈ ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వగా.. రాజస్థాన్ రాయల్స్ మూడింట్లో రెండింట గెలుపొందింది.
ఢిల్లీ బ్యాటింగ్: పృద్వీ షా (0), డేవిడ్ వార్నర్ (65), మనీశ్ పాండే (0), రీలే రూసో (14), లలిత్ యాదవ్ (38), అక్షర్ పటేల్ (2), అభిషేక్ పోరెల్ (2), కుల్దీప్ యాదవ్ (3 నాటౌట్), అన్రిచ్ నొర్టెజ్ (0), ముకేష్ కుమార్ (1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
Updated Date - 2023-04-08T19:55:07+05:30 IST