Praveen Kumar: టీమిండియా మాజీ క్రికెటర్‌కు రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు
ABN, First Publish Date - 2023-07-05T11:49:23+05:30
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మీరట్‌లో ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవ్ కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో కారులో ప్రవీణ్ కుమార్‌తోపాటు అతని కుమారుడు కూడా ఉన్నాడు.
ఉత్తరప్రదేశ్: టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మీరట్‌లో ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవ్ కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో కారులో ప్రవీణ్ కుమార్‌తోపాటు అతని కుమారుడు కూడా ఉన్నాడు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రవీణ్‌కు అతని కుమారుడికి ఎలాంటి గాయాలు కాలేదు. మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని పాండవ్ నగర్ నుంచి మీరట్‌కు ప్రవీణ్ కుమార్ తన ల్యాండ్ రోవర్ కారులో ప్రయాణిస్తున్నాడు. మీరట్‌లోని కమిషనర్ బంగ్లా వద్దకు చేరుకోగానే వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ప్రవీణ్ కుమార్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో ప్రవీణ్ కుమార్, అతని కొడుకుకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు అక్కడికి చేరుకున్నారు. ప్రవీణ్ కుమార్ అతని కుమారుడిని రక్షించడంతోపాటు ట్రక్కు డ్రైవర్‌ను పట్టుకున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోని నిందితుడైన ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా ప్రవీణ్ కుమార్ మీరట్‌లోని బాగ్‌పత్ రోడ్డులో ఉన్న ముల్తాన్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. మరోవైపు ప్రవీణ్ కుమార్ రోడ్డు ప్రమాదానికి గురికావడం ఇది మొదటిసారి ఏం కాదు. 2007లో కూడా ప్రవీణ్ ఓ సారి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కాగా పేస్ బౌలరైనా 36 ఏళ్ల ప్రవీణ్ కుమార్ 2007 నుంచి 2012 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 6 టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 27 వికెట్లు, వన్డేల్లో 77 వికెట్లు, టీ20ల్లో 8 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 119 మ్యాచ్‌లాడిన ప్రవీణ్ 90 వికెట్లు తీశాడు. బ్యాటర్‌గా వన్డేల్లో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది.
Updated Date - 2023-07-05T11:49:23+05:30 IST