ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WPL: గుజరాత్‌ జెయింట్స్‌పై 10 వికెట్ల తేడాతో ఢిల్లీ కేపిటల్స్ ఘన విజయం

ABN, First Publish Date - 2023-03-11T22:37:42+05:30

మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ జరిగిన 9వ మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ (Gujarat Giants) జట్టుపై 10 వికెట్ల తేడాతో ఢిల్లీ కేపిటల్స్ మహిళా (Delhi Capitals Women) జట్టు ఘన విజయం సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌ (Womens Premier League 2023)లో భాగంగా ఇవాళ జరిగిన 9వ మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ (Gujarat Giants) జట్టుపై 10 వికెట్ల తేడాతో ఢిల్లీ కేపిటల్స్ మహిళా (Delhi Capitals Women) జట్టు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు గుజరాత్‌ జెయింట్స్‌ నిర్దేశించిన 106 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేపిటల్స్ మహిళా జట్టు అలవోకగా గెలుపొందింది. 7.1 ఓవర్లలోనే ఢిల్లీ కేపిటల్స్ మహిళా జట్టు వికెట్లు కోల్పోకుండా 107 పరుగులు చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు 105 పరుగులు మాత్రమే చేసింది.

ఢిల్లీ కేపిటల్స్ ఉమెన్ (Delhi Capitals Women) బ్యాట్స్‌ఉమెన్ మరిజాన్ కాప్(Marizanne Kapp ) చరిత్ర సృష్టించింది. గుజరాత్‌ జెయింట్స్‌(Gujarat Giants)తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. మరోవైపు శివంగిలా విరుచుకుపడిన శిఖా పాండే(Shikha Pandey) దెబ్బకు గుజరాత్ కుదేలైంది. వారిద్దరి దెబ్బకు జెయింట్స్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది.

33 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో కిమ్ గార్త్(Kim Garth)లో కాస్తంత పోరాట పటిమ కనిపించడంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లేదంటే వంద పరుగుల లోపే ఆలౌట్ అయ్యేది. గార్త్ చేసిన 32 పరుగులే జట్టులో అత్యధికం. హర్లీన్ డియోల్ 20, వార్హమ్ 22 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్ మరిజాన్ నాలుగు వికెట్లు,శిఖా పాండే 3 వికెట్లు పడగొట్టారు.

Updated Date - 2023-03-11T22:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising