IND vs AUS: తెలుగు కుర్రాడి సూపర్ ఫీల్డింగ్ దెబ్బకు సింగిల్ డిజిట్‌కే సెంచరీ హీరో ఔట్!
ABN, First Publish Date - 2023-11-27T10:50:15+05:30
Tilak Varma: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన జోష్ ఇంగ్లీస్ ఈ సారి సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరాడు.
తిరువనంతపురం: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన జోష్ ఇంగ్లీస్ ఈ సారి సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరాడు. భారత్ విసిరిన 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 35 పరుగులకే మాథ్యు షాట్ (19) వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన జోష్ ఇంగ్లీస్ వికెట్ కూడా కోల్పోయింది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతిని జోష్ ఇంగ్లీస్ మిడాన్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆ బంతిని వెనక్కి పరిగెత్తుతూ గాల్లోకి ఎగిరి అద్భుతంగా అందుకున్నాడు. క్యాచ్ పట్టాక తిలక్ వర్మ కింద పడ్డాడు. అయినప్పటికీ బంతిని మాత్రం నేలను తాకనివ్వకుండా చక్కగా కంట్రోల్ చేశాడు.
దీంతో జోష్ ఇంగ్లీస్ ఔటయ్యాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన జోష్ ఇంగ్లీస్ ఈ మ్యాచ్‌లో మాత్రం తిలక్ వర్మ అద్భుత ఫీల్డింగ్ దెబ్బకు కేవలం 2 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో 39 పరుగులకే ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. కీలకమైన జోష్ ఇంగ్లీస్ వికెట్‌తో మ్యాచ్ కూడా మన వైపు తిరిగింది. తిలక్ వర్మ సూపర్ ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తిలక్ వర్మపై క్రికెట్ అభిమానులతోపాటు నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), యశస్వీ జైస్వాల్ (25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 53), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52) తుఫాన్ ఇన్నింగ్స్ ధాటికి 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. ఎల్లి్‌సకు మూడు వికెట్లు దక్కాయి. భారత బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో భారీ ఛేదనలో ఆసీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులకే పరిమితమైంది. స్టొయినిస్ (25 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 45), మాథ్యూ వేడ్ (23 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 42 నాటౌట్), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) ఫర్వాలేదనిపించారు. రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్‌లకు మూడేసి వికెట్లు లభించాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా యశస్వీ జైస్వాల్ నిలిచాడు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-0కి చేరింది.
Updated Date - 2023-11-27T10:50:17+05:30 IST