ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs PAK: విరాట్ కోహ్లీతో సమంగా కేఎల్ రాహుల్.. ఆ రికార్డు సమం!

ABN, First Publish Date - 2023-09-10T20:54:04+05:30

టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన ఓ రికార్డును స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సమం చేశాడు. ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ తన వన్డే కెరీర్‌లో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.

కొలంబో: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన ఓ రికార్డును స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సమం చేశాడు. ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ తన వన్డే కెరీర్‌లో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ మార్కును రాహుల్ 53 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నాడు. దీంతో వన్డేల్లో వేగంగా 2 వేల పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా విరాట్ కోహ్లీతో కలిసి సమంగా నిలిచాడు. కాగా కోహ్లీ కూడా తన వన్డే కెరీర్‌లో 53 ఇన్నింగ్స్‌ల్లోనే 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా మొదటి స్థానంలో ఉన్నాడు. ఆమ్లా 40 ఇన్నింగ్స్‌ల్లోనే 2 వేల పరుగులు పూర్తి చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో శిఖర్ ధావన్(48), సిద్దూ(52), గంగూలీ(52) ఉన్నారు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అనుకున్నట్టుగానే సూపర్ 4లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(8), రాహుల్(17) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ(56), శుభ్‌మన్ గిల్(58) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. హాఫ్ సెంచరీలతో చెలరేగిన వీరిద్దరు తొలి వికెట్‌కు 121 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ అయ్యారు.

Updated Date - 2023-09-10T20:54:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising