ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs WI: ఆస్ట్రేలియా దిగ్గజాల రికార్డును బద్దలు కొట్టిన అశ్విన్, జడేజా

ABN, First Publish Date - 2023-07-13T16:37:36+05:30

వెస్టిండీస్‌తో మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అశ్విన్, జడేజా కలిసి 8 వికెట్లు పడగొట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డొమినికా: వెస్టిండీస్‌తో మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అశ్విన్, జడేజా కలిసి 8 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలింగ్ జోడిలో జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్లు జిడి మెక్‌గ్రాత్, జేఎన్ గిల్లెస్పీని అధిగమించారు. టెస్ట్ క్రికెట్‌లో మెక్‌గ్రాత్, గిల్లెస్పీ కలిసి 484 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో 486 వికెట్లతో వారి రికార్డును టీమిండియా స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా బద్దలుకొట్టారు. దీంతో అశ్విన్, జడేజా దెబ్బకు మెక్‌గ్రాత్, గిల్లెస్పీ రికార్డు గల్లంతయింది. కాగా ఇందులో అశ్విన్ సాధించిన వికెట్లు 264 ఉండగా.. జడేజా సాధించిన వికెట్లు 222 ఉన్నాయి. 48 మ్యాచ్‌ల్లోనే అశ్విన్, జడేజా ఈ రికార్డును అందుకోవడం గమనార్హం. మొత్తంగా ఈ జాబితాలో అశ్విన్, జడేజా 13వ స్థానానికి చేరుకున్నారు. ఇక ఇప్పటికే అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలింగ్ జోడిగా అశ్విన్, జడేజా ఉన్నారు.


ఈ జాబితాలో ఇంగ్లండ్ వెటరన్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ మొదటి స్థానంలో ఉన్నారు. వారిద్దరి ఖాతాలో ఏకంగా 1031 వికెట్లు ఉన్నాయి. పైగా వీరిద్దరు ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నారు. దీంతో భవిష్యత్‌లో అండర్సన్, బ్రాడ్ మరిన్ని వికెట్లు సాధించే అవకాశాలున్నాయి. ఇక వెస్టిండీస్‌తో మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెలరేగారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు 150 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ 5, జడేజా 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(30), యశస్వి జైస్వాల్ (40) ఉన్నారు. భారత జట్టు ఇంకా 70 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది.

Updated Date - 2023-07-13T16:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising