ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Team India: భళా టీమిండియా!.. క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ మనమే టాప్

ABN, First Publish Date - 2023-02-15T15:46:14+05:30

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాపై మొదటి టెస్టులో అద్భుతవిజయం సాధించిన టీమిండియా (Team India) టెస్ట్ ఫార్మాట్‌లో నంబర్ స్థానానికి ఎగబాకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో (border gavaskar trophy 2023) భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాపై (IndiaVsAustralia) మొదటి టెస్టులో అద్భుతవిజయం సాధించిన టీమిండియా (Team India) టెస్ట్ ఫార్మాట్‌లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. నాగ్‌పూర్‌లో అన్ని విభాగాల్లో రాణించిన భారత్ మొత్తం 115 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ కంటే 4 పాయింట్లు వెనుకబడి 111 పాయింట్లతో ఆసీస్ (Cricket Australia) 2వ ర్యాంక్‌కు పడిపోయింది. ఇక 106 పాయింట్లతో ఇంగ్లండ్ మూడో స్థానంలో నిలిచాయి. అయితే ఫిబ్రవరి 16 నుంచి న్యూజిలాండ్‌పై టెస్ట్ సిరీస్ ఆడునున్న ఇంగ్లండ్ తన స్థానాన్ని మెరుగుపరచుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకోవడంతో ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లోనూ భారతే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే, టీ20 క్రికెట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

బౌలర్లలో టాప్ ర్యాంక్‌ దిశగా అశ్విన్..

ఆసీస్‌పై మొదటి టెస్టు టీమిండియా ఘన విజయంలో కీలకపాత్ర పోషించిన స్పిన్సర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా తమ వ్యక్తిగత ర్యాంకులను గణనీయంగా మెరుగుపరుచుకున్నారు. ముఖ్యంగా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. బౌలర్ల విభాగంలో నంబర్ 1 ర్యాంకు దిశగా దూసుకెళ్తున్నాడు. టెస్టు బౌలర్లలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్ కేవలం 21 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఐసీసీ ఆఫీషియల్ వెబ్‌సైట్ ప్రకారం.. నాగ్‌పూర్ టెస్టులో అద్భుతమైన సెంచరీ సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ 10వ స్థానం నుంచి 8వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక వెస్టిండీస్ వర్ధమాన స్పిన్నర్ గుడకెష్ మోతీ జింబాబ్వేపై 2 టెస్టుల్లో 19 వికెట్లు తీసి 77వ స్థానం నుంచి 46వ ర్యాంక్‌కు ఎగబాకాడు. కాగా నాగ్‌పూర్ టెస్టులో అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరూ కలిసి ఏకంగా 15 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-02-15T16:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising