India vs Ireland: గత ఐపీఎల్ స్టార్ అరంగేట్రం.. మొదటి టీ20 మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
ABN, First Publish Date - 2023-08-17T18:57:37+05:30
ఐర్లాండ్‌లో టీమిండియా పర్యటన శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత్, ఐర్లాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో యువ జట్టుతో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
డబ్లిన్: ఐర్లాండ్‌లో టీమిండియా పర్యటన శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత్, ఐర్లాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో యువ జట్టుతో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత బుమ్రా మళ్లీ బంతి పట్టుకోనున్నాడు. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మ్యాచ్ జరిగే మలాహిడే క్రికెట్ క్లబ్ గ్రౌండ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. బౌలర్లకు కూడా ఈ పిచ్ బాగానే మద్దతిస్తుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపుతారు. చివరి ఓవర్లలో పేసర్లకు సహకరిస్తుంది. ఈ పర్యటన నుంచి భారత జట్టు సీనియర్లందరికీ విశ్రాంతినిచ్చింది. దీంతో పూర్తిగా యువ జట్టుతో బరిలోకి దిగనుంది. కెప్టెన్ బుమ్రా ఒక్కడే సీనియర్ ఆటగాడు. అయితే మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మొదటి టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ మ్యాచ్‌తో గత ఐపీఎల్‌లో అదరగొట్టిన యువ ఆటగాడు అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి.
ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఖాయమనే చెప్పుకోవాలి. దీంతో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కూడా కుదురుతుంది. మూడో స్థానంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, నాలుగో స్థానంలో వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఆడే అవకాశాలున్నాయి. విండీస్ పర్యటనలో తిలక్ వర్మ రాణించడంతో ఐర్లాండ్ పర్యటనలో అతనిపై భారీ అంచనాలున్నాయి. ఐదో స్థానంలో రింకూ సింగ్ ఆడే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రింకూ సింగ్ అరంగేట్రం చేస్తాడు. కాగా గత ఐపీఎల్ 2023లో రింకు సింగ్ అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆల్ రౌండర్లు శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ ఆడొచ్చు. శివమ్ దూబే పేస్ ఆల్‌రౌండర్ కాగా.. సుందర్ స్పిన్ ఆల్‌రౌండర్. ఇక పేస్ కోటాలో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు తోడు అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగడం ఖాయమని చెప్పుకోవాలి. మూడే పేసర్ కూడా కావాలనుకుంటే ముఖేష్ కుమార్‌కు చోటు దక్కుతుంది. ప్రధాన స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ బరిలోకి దిగనున్నాడు. బిష్ణోయ్, సుందర్‌కు తోడు మరో స్పిన్నర్ కావాలనుకుంటే షాబాజ్ అహ్మద్‌ను ఆడించొచ్చు. అప్పుడు పేసర్ ముఖేష్ కుమార్ బెంచ్‌కే పరిమితమవుతాడు.
టీమిండియా ప్లేయింగ్ 11(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), ముఖేష్ కుమార్.
Updated Date - 2023-08-17T18:59:06+05:30 IST