ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs Pakistan మ్యాచ్ ఒక్కో టికెట్ ధర అర కోటి పైనే! నమ్మడం లేదా? అయితే ఈ వార్త చదివేయండి..

ABN, First Publish Date - 2023-09-05T22:14:02+05:30

India vs Pakistan మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సాధారణ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు తలపడితేనే మ్యాచ్ కోసం అభిమానులు ఎగబడతారు.

India vs Pakistan మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సాధారణ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు తలపడితేనే మ్యాచ్ కోసం అభిమానులు ఎగబడతారు. అలాంటిది ప్రపంచకప్‌లో తలపడుతున్నాయంటే అభిమానులు అదొక చిన్నపాటి యుద్ధం మాదిరిగానే భావిస్తుంటారు. అన్ని పనులు మానుకుని మరి టీవీలకు అతుక్కుపోతారు. ఇక స్టేడియానికి వెళ్లి ప్రత్యక్షంగా చూసే వారైతే డబ్బులకు వెనుకాడరు. ఇదే అదునుగా స్టేడియం నిర్వహకులు కూడా టికెట్ ధరలను అమాంతం పెంచేయడం జరుగుతుంటుంది. కానీ ఎంత పెరిగినా అది లక్ష లోపే ఉండేది. కానీ ఈ సారి వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 14న జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్ ధరలు ఆకాశన్నంటాయి. ఒక్కో టికెట్ ధర ఏకంగా అరకోటిపైనా ఉన్నాయి. దీంతో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్‌కు పెట్టే డబ్బులతో ఓ డబుల్ బెడ్ రూం ఇంటిని కొనేయొచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వినడానికి నమ్మశక్యం కానీ విధంగా ఉన్నప్పటికీ ఇది నిజం.


వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ టికెట్ల విక్రయం కూడా ఇప్పటికే పూర్తైంది. ఆగష్టు 29, సెప్టెంబర్ 3న అధికారికంగా టికెట్లను బుక్ మై షో యాప్ ద్వారా విక్రయించారు. మ్యాచ్‌కు ఉన్న డిమాండ్ దృష్యా టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టిన నిమిషాల వ్యవధిలోనే అన్ని అమ్ముడయ్యాయి. టికెట్ల కోసం ప్రయత్నించిన అభిమానులకు సోల్డ్ ఔట్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో తీవ్ర నిరాశకు గురికాక తప్పలేదు. అయితే ఎలాగైనా సరే స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడాలనుకునేవారు టికెట్ల కోసం సెకండరీ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు సెకండరీ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న సౌత్ ప్రీమియం వెస్ట్ బే టికెట్ సంస్థకు చెందిన సెకండరీ మార్కెట్ వయాగోగో రేట్లను భారీగా పెంచేసింది.

ఇప్పటికే ఆ ప్లాట్‌ఫామ్‌లో భారత్, పాకిస్థాన్‌కు చెందిన కొన్ని టికెట్లను ఒక్కొక్కటి రూ.19.5 లక్షల చొప్పున అమ్మినట్లు తెలుస్తోంది. అయితే వయాగోగోలో ప్రారంభ ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రారంభ ధరలు రూ.57,198గా ఉన్నాయి. ఇక స్టేడియం అప్పర్ టైర్‌లో రెండు టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నట్టు వయాగోగోలో(Viagogo) చూపిస్తుంది. వాటి ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.57,62,676 లక్షలుగా చూపిస్తోంది. రెండు టికెట్లు కావాలంటే కోటికిపైగా సమర్పించుకోవాలి. ఒక వేళ రెండు టికెట్లు కొనాలంటే రూ.1,15,25,352 కోట్లు అవుతుంది. దీంతో వయాగోగోలో ఈ టికెట్ల ధరలు చూసిన అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. మరికొందరైతే భారీగా ఉన్న టికెట్ల ధరల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్‌కు పెట్టే డబ్బులతో ఓ డబుల్ బెడ్ రూం ఇంటిని(double bedroom House) కొనేయొచ్చని మరికొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇతర మ్యాచ్‌లు ధరలు ఈ స్థాయిలో కాకపోయినా అవి కూడా వయాగోగోలో భారీగానే ఉన్నాయి. వయాగోగోలో భారత్, ఇంగ్లండ్ ప్రారంభ టికెట్ ధరలు రూ. 27,285గా ఉండగా.. గరిష్ట ధరలు రూ.2.85 లక్షలుగా ఉన్నాయి. భారత్, ఆస్ట్రేలియా టికెట్ల గరిష్ట ధరలు రూ. 2,09,551 లక్షలుగా ఉన్నాయి.

Updated Date - 2023-09-05T22:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising