ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India Vs NewZealand: రెండో టీ20 మనదే.. సిరీస్ సమం

ABN, First Publish Date - 2023-01-29T22:19:36+05:30

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (IndiaVsNewZealand) 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ (T20 Series) రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో భారత్ ఉత్కంఠభరిత విజయం సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (IndiaVsNewZealand) 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ (T20 Series) రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో భారత్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. 100 పరుగుల సునాయాస లక్ష్యంతో బరిలోకి భారత బ్యాట్స్‌మెన్ చివరి రెండు బంతుల వరకు చెమటోడ్చాల్సి వచ్చింది. దీంతో 19.5 ఓవర్లు 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించారు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ టీమిండియా బ్యాటర్లు కాస్త తడబాటుకు గురయ్యారు. పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (11), ఇషాన్ కిషన్ (19) త్వరగానే ఔటయ్యారు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (13), సూర్యకుమార్ యాదవ్ (26 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (10 రనౌట్), హార్ధిక్ పాండ్యా (15) చొప్పున పరుగులు చేశారు. భారత్ విజయంలో సూర్య, హార్ధిక పాండ్యా భాగస్వామ్యం కీలక పాత్ర పోషించింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ బ్రేస్‌వెల్, ఇష్ సోధి చెరో వికెట్ తీశారు. మరో వికెట్ రనౌట్ (ఇషాన్ కిషన్) రూపంలో పడింది.

కాగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బ్యాటర్లను భారత బౌలర్లు కట్టడిచేశారు. చక్కటి లైనప్‌తో బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. 19 పరుగులు చేసిన కెప్టెన్ సాంట్నర్ జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లు ఫిన్ అలెన్ (11), కాన్వే (11), చాప్‌మన్(14, రనౌట్), గ్లెన్ ఫిలిప్ (5), డారిల్ మిచెల్ (8), ఎం బ్రేస్‌వెల్ (14), సాంట్నర్ (19 నాటౌట్) ఇష్ సోధి (1), లూకీ ఫెర్గుసన్ (0), జాకబ్ డఫీ (6 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయగా.. హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, చాహల్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్ అందరూ తలో వికెట్ తీశారు.

Updated Date - 2023-01-29T22:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising