IND VS IRE : రెండో టీ20 భారత్ కైవసం.. మెరుపు ఇన్సింగ్ చేసిన రింకూ సింగ్
ABN, First Publish Date - 2023-08-21T00:27:38+05:30
రెండో టీ20(second T20)లో ఐర్లాండ్‌పై భారత్ గెలుపొందింది. 33 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై భారత్ విజయం సాధించింది. మూడు టీ20 సిరీస్‌ని ఒక మ్యాచ్ మిగిలుండగానే టీం ఇండియా కైవసం చేసుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో మొదటిసారి బ్యాటింగ్ చేసిన రింకూ సింగ్ (Rinku Singh) (38; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
డబ్లిన్: రెండో టీ20(second T20)లో ఐర్లాండ్‌పై భారత్ గెలుపొందింది. 33 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై భారత్ విజయం సాధించింది. మూడు టీ20 సిరీస్‌ని ఒక మ్యాచ్ మిగిలుండగానే టీం ఇండియా కైవసం చేసుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో మొదటిసారి బ్యాటింగ్ చేసిన రింకూ సింగ్ (Rinku Singh) (38; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. మెకర్థీ వేసిన 19 ఓవర్లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదిన రింకూ.. అడైర్ వేసిన చివరి ఓవర్లో నాలుగో బంతికి సిక్స్ బాదాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (58; 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో రాణించగా.. సంజూ శాంసన్ (40; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. తొలి టీ20లో గోల్డెన్ డక్ అయిన తిలక్ వర్మ (1) ఈ మ్యాచ్‌లో కూడా నిరాశపర్చాడు. అంతర్జాతీయ టీ20ల్లో మొదటిసారి బ్యాటింగ్ చేసిన రింకూ సింగ్ (38; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. శివమ్ దూబే (22*; 16 బంతుల్లో 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. యశస్వి జైస్వాల్ (18) పరుగులు చేశాడు. చివరి రెండు ఓవర్లలో భారత బ్యాటర్లు 42 పరుగులు పిండుకున్నారు. ఐర్లాండ్ బౌలర్లలో మెకర్థీ 2, మార్క్ అడైర్, క్రెయిగ్ యంగ్, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు.
Updated Date - 2023-08-21T00:28:20+05:30 IST