ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indw vs Banw: షఫాలీ వర్మ అద్భుత బౌలింగ్.. లోస్కోరింగ్ మ్యాచ్‌లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

ABN, First Publish Date - 2023-07-11T18:09:43+05:30

స్పిన్ ద్వయం దీప్తిశర్మ(3/12), షఫాలీ వర్మ(3/15) అద్భుత బౌలింగ్‌తో లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఉమెన్స్‌ జట్టుపై టీమిండియా ఉమెన్స్ జట్టు జయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌలింగ్ చేసిన షఫాలీ వర్మ రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌కు 8 పరుగుల తేడాతో అనూహ్య విజయాన్ని అందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా: స్పిన్ ద్వయం దీప్తిశర్మ(3/12), షఫాలీ వర్మ(3/15) అద్భుత బౌలింగ్‌తో లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఉమెన్స్‌ జట్టుపై టీమిండియా ఉమెన్స్ జట్టు జయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌలింగ్ చేసిన షఫాలీ వర్మ రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌కు 8 పరుగుల తేడాతో అనూహ్య విజయాన్ని అందించింది. బంగ్లాదేశ్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరమైన సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన షఫాలీ వర్మ ఒకే ఒక్క పరుగు ఇచ్చి 3 వికెట్లు తీసింది. అంతేకాకుండా రనౌట్ రూపంలో మరో వికెట్ లభించింది. దీంతో మొత్తంగా చివరి ఓవర్లో భారత్‌కు ఏకంగా 4 వికెట్లు దక్కాయి. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.


భారత్ విసిరిన 96 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మహిళలు ఒకానొక దశలో చేధించేలాగా కనిపించారు. 15 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ గెలవాలంటే మరో 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. 5 వికెట్లు కూడా చేతిలో ఉన్నాయి. దీంతో ఆ జట్టు గెలుపు ఖాయమనిపించింది. కానీ టీమిండియా బౌలర్లు కట్టడి చేయడంలో పరుగులు రావడం కష్టమైంది. అంతకుముందు టాపార్డర్‌ను దీప్తి శర్మ, మిన్ను మణి(2/9) కుప్పకూల్చడంతో 64 పరుగులకే బంగ్లాదేశ్ సగం వికెట్లు కోల్పోయింది. ఇక చివరి 2 ఓవర్లలో 14 పరుగులు కావాల్సిన సమయంలో స్పిన్నర్ దీప్తి శర్మ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. బంగ్లాదేశ్‌ను విజయం దిశగా నడిపిస్తున్న కెప్టెన్ నిగర్ సుల్తానాను (55 బంతుల్లో 38 పరుగులు) పెవిలియన్ చేర్చింది. అంతేకాకుండా ఆ ఓవర్లో 4 పరుగులే ఇచ్చింది. దీంతో ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా షపాలీ వర్మ అద్భుతమే చేసింది. మొదటి బంతికి ఒక పరుగు వచ్చినప్పటికీ రబేయా ఖాన్ రనౌట్ అయింది. ఆ తర్వాతి 5 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వని షఫాలీ 3 వికెట్లు పడగొట్టింది. దీంతో బంగ్లాదేశ్ 87 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ రెండో టీ20 మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో భారత అమ్మాయిలు గెలిచారు. 12 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసిన దీప్తిశర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

అంతకుముందు బ్యాటింగ్ వైఫల్యంతో భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లు వరుస విరామాలలో వికెట్లు తీయడంతో భారత మహిళల కనీసం 100 పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయారు. అంతేకాకుండా ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీసం 20 పరుగులు చేయలేకపోయారు. 19 పరుగులు చేసిన షఫాలీ వర్మనే టాప్ స్కోరర్. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖాతున్ 3, ఫాహిమా ఖాతున్ 2, ఫాహిమా ఖాతున్, మరుఫా అక్టర్, నహిదా అక్టర్ తలో వికెట్ తీశారు.

Updated Date - 2023-07-11T18:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising