Formula E: గ్రీన్‌కో ఇ-ప్రిక్స్‌లో I-టైప్ 6ను ప్రారంభించనున్న జాగ్వార్ టీసీఎస్ రేసింగ్
ABN, First Publish Date - 2023-02-07T19:19:54+05:30
2023 ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్(2023
న్యూఢిల్లీ: 2023 ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్(2023 ABB FIA Formula E World Championship) కోసం జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జాగ్వార్ I-Type 6ని ప్రారంభించనుంది. ఆల్ ఎలక్ట్రిక్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ సీజన్ 9 కోసం 4 సరికొత్త రేస్ లొకేషన్‌లలో మొదటిదైన గ్రీన్‌కో హైదరాబాద్ ఇ-ప్రిక్స్‌లో ఈ నెల 11 మధ్యాహ్నం 3 గంటలకు లైట్లు ఆకుపచ్చగా మారుతాయి. హుస్సేన్‌సాగర్ ఒడ్డున 2.83 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌లో 32 ల్యాప్‌లు ఈ రేసులో ఉన్నాయి.
డ్రైవర్లు మిచ్ ఎవాన్స్, శామ్ బర్డ్ జనవరిలో డిరియా డబుల్-హెడర్‌లో సానుకూల ప్రదర్శనల తర్వాత మరిన్ని పాయింట్లు, పోడియంలను పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు, మూడు రౌండ్లలో, శామ్ వరుసగా మూడు, నాలుగు స్థానాలను సాధించాడు. మిచ్ వరుసగా పది, ఏడో స్థానాలతో ముగించాడు.
జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ అధికారిక సప్లయర్‌గా చేరిన ఏరో (Aero)తో సరికొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించింది. పెయింట్ పరిశ్రమకు విప్లవాత్మకమైన ఏరో అధునాతన టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా సంప్రదాయ కార్ పెయింట్‌కు సమూల ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఏరో సెల్ఫ్-హీలింగ్ ఫిల్మ్ సిస్టమ్ జాగ్వార్ I-TYPE 6 కొత్త నలుపు, తెలుపు, బంగారు అసమాన లైవరీపై ఉపయోగించబడుతుంది. సున్నా కార్బన్‌ను విడుదల చేయడం, అస్థిర కర్బన సమ్మేళనాలు (VOCs), పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) సమ్మేళనాలు లేని పర్యావరణ ప్రయోజనాలతో సహా ఏరో ఉత్పత్తి ప్రపంచంలోని మొట్టమొదటి నికర కార్బన్ జీరో క్రీడలో జట్టు భాగస్వామ్యాన్ని ప్రతిధ్వనిస్తుంది.
ఈ సందర్భంగా జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ డ్రైవర్ మిచ్ ఎవాన్స్ మాట్లాడుతూ.. కొత్త ట్రాక్ గురించి తాను ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటానని పేర్కొన్నారు. హైదరాబాద్ కూడా దీనికి మినహాయింపు కాదన్నారు. గతేడాది తాను జకార్తా, సియోల్‌లో మొదటిసారి రేసులో పాల్గొని విజయం సాధించినట్టు చెప్పారు. కాబట్టి హైదరాబాద్‌లోనూ అదే జోరు కొనసాగిస్తే కొన్ని సాలిడ్ పాయింట్లు పొందగలుగుతామన్నారు.
మరో రేసింగ్ డ్రైవర్ శామ్ బర్డ్ మాట్లాడుతూ.. డబుల్ హెడర్ వారాంతంలో పోడియం, అత్యంత వేగవంతమైన ల్యాప్‌ని భద్రపరచడం ద్వారా దిరియాలో తన ప్రదర్శనపై ఆనందంగా ఉందని, అదే విశ్వాసాన్ని కొనసాగిస్తూ భారత్‌లో నాలుగో రౌండ్‌లో మరింత మెరుగ్గా ఉండేందుకు మోటివేషన్ గా మార్చుకుంటున్నట్టు చెప్పారు. టీమ్ మొత్తానికి హైదరాబాద్ చాలా పెద్ద రేసుగా ఉండబోతోందని, అందుకు తాను రెడీగా ఉన్నానని చెప్పారు.
జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ టెక్నికల్ మేనేజర్ ఫిల్ చార్లెస్ మాట్లాడుతూ.. ఈ కొత్త ట్రాక్‌తో మమ్మల్ని తాము మమేకం చేసుకోవడానికి టీమ్ సిమ్యులేటర్‌పై పని చేయడానికి విలువైన సమయాన్ని వెచ్చించిందన్నారు. ‘ఏరో’ సీఈవో జేమ్స్ ఇ మెక్‌గ్యురే మాట్లాడుతూ..ఏరో ఎల్లప్పుడూ మోటర్‌స్పోర్ట్‌లో బాగా సరిపోయేది, తేలికైన పనితీరు, మన్నిక, సౌందర్య విలువను అందిస్తుందన్నారు. ప్రపంచంలోని మొట్టమొదటి నికర జీరో కార్బన్ క్రీడ అయిన ఫార్ములా Eలో పోటీ పడుతున్న జాగ్వార్ టీసీఎస్ రేసింగ్‌లో తమకు గొప్ప భాగస్వామిగా ఉన్నట్టు పేర్కొన్నారు.
Updated Date - 2023-02-07T19:19:56+05:30 IST