ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bumrah: బుమ్రా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

ABN, First Publish Date - 2023-08-17T03:56:38+05:30

కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(Captain Hardik Pandya)తోపాటు ఇతర సీనియర్‌ క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వడంతో ఐర్లాండ్‌(Ireland)తో జరిగే టీ20లకు ఏస్‌ పేసర్‌ జస్ర్పీత్‌ బుమ్రా(Jasrpeet Bumrah) టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.

బంతి పట్టిన టీమిండియా పేసర్‌

నెట్స్‌లో తీవ్ర సాధన

డబ్లిన్‌: కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(Captain Hardik Pandya)తోపాటు ఇతర సీనియర్‌ క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వడంతో ఐర్లాండ్‌(Ireland)తో జరిగే టీ20లకు ఏస్‌ పేసర్‌ జస్ర్పీత్‌ బుమ్రా(Jasrpeet Bumrah) టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు. మూడు టీ20లలో పాల్గొనేందుకు మంగళవారం ఇక్కడకు చేరిన భారత జట్టు మరుసటి రోజే ప్రాక్టీస్‌ ప్రారంభించింది. తొలి మ్యాచ్‌ శుక్రవారం జరగనుంది. గాయం కారణంగా సుదీర్ఘ విరామం అనంతరం పునరాగమనం చేసిన బుమ్రా ఎలా బౌలింగ్‌(Bowling) చేస్తాడు, జట్టును ఎలా నడిపిస్తాడనే విషయమై ఆసక్తి ఏర్పడింది. ఇక..యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా చేసిన ప్రాక్టీస్‌ ఫొటోలను బీసీసీఐ సోషల్‌మీడియా(BCCI Social Media)లో పోస్ట్‌ చేసింది. 29 ఏళ్ల బుమ్రా గతేడాది సెప్టెంబరు 22న హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో చివరిసారి ఆడాడు.

ఆ తర్వాత వెన్ను గాయానికి లోనుకావడంతో అతడు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. దాంతో దాదాపు ఏడాది క్రికెట్‌కు దూరంగా ఉన్న జస్ర్పీత్‌.. బుధవారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. పూర్తి స్థాయిలో అతడు నెట్స్‌లో బౌలింగ్‌ చేయడం విశేషం. ఈక్రమంలో అతడు వేసిన ఓ బౌన్సర్‌ జట్టులోని కుడిచేతి వాటం బ్యాటర్‌ వికెట్‌ను గిరాటేసింది. మరో ఎడమ చేతి బ్యాటర్‌కు అద్భుతమైన యార్కర్‌ సంధించాడు. మొత్తంగా చాలాకాలం తర్వాత బంతి చేతపట్టిన బుమ్రా ప్రశంసనీయ రీతిలో బౌలింగ్‌ చేయడం ఆసియా కప్‌తోపాటు వరల్డ్‌ కప్‌నకు ముందు టీమిండియాకు శుభవార్తే.

Updated Date - 2023-08-17T04:57:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising