ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

INDW vs BANW: ఆల్‌రౌండ్‌ షోతో దుమ్ములేపిన జెమిమా.. రెండో వన్డేలో భారత అమ్మాయిలు ఘనవిజయం

ABN, First Publish Date - 2023-07-19T17:20:03+05:30

జెమిమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ షోతో దుమ్ములేపడంతో రెండో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ మహిళలపై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. జెమిమాకు బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, బౌలింగ్‌లో దేవికా వైద్య సహకరించడంతో ఏకపక్షంగా సాగిన పోరులో బంగ్లాదేశ్‌పై టీమిండియా మహిళలు 108 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేశారు.

ఢాకా: జెమిమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ షోతో దుమ్ములేపడంతో రెండో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ మహిళలపై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. జెమిమాకు బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, బౌలింగ్‌లో దేవికా వైద్య సహకరించడంతో ఏకపక్షంగా సాగిన పోరులో బంగ్లాదేశ్‌పై టీమిండియా మహిళలు 108 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేశారు. భారత్ విసిరిన 229 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మహిళలు ఒకానొక దశలో చేధించేలాగా కనిపించారు. 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా బంగ్లా మహిళలను నాల్గో వికెట్‌కు 68 పరుగుల హాఫ్ సెంచరీతో పాట్నర్‌షిప్‌తో ఫర్గానా హోక్(47), రీతు మోని(27) ఆదుకున్నారు. ఆ జట్టు 106-3తో పటిష్ట స్థితిలో ఉన్న సమయంలో పాట్నర్‌షిప్‌ను స్పిన్నర్ దేవికా వైద్య విడదీసింది. 47 పరుగులు చేసిన హోక్‌ను పెవిలియన్ చేర్చింది. అక్కడి నుంచి స్పిన్నర్లు దేవికా వైద్య, జెమీమా రోడ్రిగ్స్ చెలరేగారు. వరుస ఓవర్లలో వికెట్లు తీశారు. దీంతో బంగ్లాదేశ్ మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు బంగ్లాదేశ్ జట్టు 35 ఓవర్లు మాత్రమే ఆడి 120 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో జెమీమా రోడ్రిగ్స్ 3 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లతో చెలరేగింది. దేవికా వైద్య కూడా 3 వికెట్లతో సత్తా చాటింది. మేఘనా సింగ్, దీప్తి శర్మ, స్నేహ రానా తలో వికెట్ తీశారు.


అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్(78 బంతుల్లో 86 పరుగులు), హర్మన్‌ప్రీత్ కౌర్(88 బంతుల్లో 52 పరుగులు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. స్మృతి మంధాన 36, హర్లీన్ డియోల్ 25, యాస్తిక భాటియా 15 పరుగులు చేశారు. ముఖ్యంగా జెమిమా రోడ్రిగ్స్ చెలరేగింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, డియోల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 131 పరుగుల సెంచరీ పాట్నర్‌షిప్ నెలకొల్పింది. కాగా 37వ ఓవర్లో హర్మన్ ప్రీత్ కౌర్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు వెళ్లిపోయింది. డియోల్ ఔటైక మళ్లీ క్రీజులకో వచ్చినప్పటికీ ఎక్కువ సేపు ఆడలేకపోయింది. ఇక చివరి ఓవర్లో భారత జట్టు ఏకంగా 3 వికెట్లు కోల్పోవడం గమనార్హం. బ్యాట్, బాల్‌తో అదరగొట్టిన జెమిమాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో సిరీస్‌ను భారత మహిళలు 1-1తో సమం చేశారు. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే మ్యాచ్ ఈ నెల 22న జరగనుంది.

Updated Date - 2023-07-19T17:22:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising