Home » Jemimah Rodrigues
టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించింది. ఎవరికీ అందని ఫీట్‌ను రీచ్ అయింది. 48 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న అరుదైన రికార్డును బద్దలుకొట్టింది.
జెమిమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ షోతో దుమ్ములేపడంతో రెండో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మహిళలపై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. జెమిమాకు బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, బౌలింగ్‌లో దేవికా వైద్య సహకరించడంతో ఏకపక్షంగా సాగిన పోరులో బంగ్లాదేశ్‌పై టీమిండియా మహిళలు 108 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేశారు.