Canada Open 2023: కెనడా ఓపెన్ విజేత లక్ష్యసేన్.. ఉత్కంఠ పోరులో చైనాపై గెలుపు
ABN, First Publish Date - 2023-07-10T11:40:16+05:30
భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్ (Lakshya Sen) కెనాడా ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను (Canada Open 2023 title) కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ లి షి ఫెంగ్‌ను (All England champion Lo Shi Feng) లక్ష్యసేన్ ఓడించాడు.
భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్ (Lakshya Sen) కెనాడా ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను (Canada Open 2023 title) కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ లి షి ఫెంగ్‌ను (All England champion Lo Shi Feng) లక్ష్యసేన్ ఓడించాడు. చైనాకు చెందిన లి షి ఫెంగ్‌ను లక్ష్యసేన్ 21-18, 22-20తో వరుస సెట్లలో ఓడించి కెనడా ఓపెన్ విజేతగా నిలిచాడు. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడి లి షి ఫెంగ్‌కు షాక్ ఇచ్చాడు. ఫైనల్‌లో అసాధారణ ఆట తీరు కనబర్చిన లక్ష్యసేన్ కళ్లు చెదిరే స్మాష్‌లతో ఆకట్టుకున్నాడు. 21 ఏళ్ల లక్ష్యసేన్‌కు ఇది రెండో బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టైటిల్. జనవరి 2022లో ఇండియా ఓపెన్ (India Open) గెలిచిన తర్వాత లక్ష్యసేన్ గెలిచిన రెండో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ (BWF World Tour title) టైటిల్ ఇదే.
ప్రస్తుతం బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో 19వ స్థానంలో ఉన్న లక్ష్యసేన్ ఈ టోర్నీ అసాంతం అద్భుత ఆట తీరును కనబర్చాడు. రౌండ్ దశలోనే నాల్గవ ర్యాంకర్ ఆటగాడు కున్లావుడ్ విటిడ్‌సర్న్‌ను ఓడించాడు. ఇక సెమీఫైనల్‌లో అయితే జపాన్‌కు చెందిన కెంటో నిషిమోటోపై (Kento Nishimoto of Japan) గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టాడు. సెమీస్‌లో నిషిమోటోను లక్ష్యసేన్ 21-17, 21-14తో వరుస సెట్లలో ఓడించాడు. గతేడాది ఆగష్టులో ప్రపంచ ఛాంపియన్‌షిప్ ముగిసిన తర్వాత లక్ష్యసేన్ ముక్కుకు శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత కోలుకుని నిదానంగా ఆటలో పుంజుకున్న లక్ష్యసేన్ తాజాగా కెనడా ఓపెన్ టైటిల్‌ను ఎగురేసుకుపోయాడు.
Updated Date - 2023-07-10T11:46:07+05:30 IST