ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MI vs LSG: కీలక మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్లలో టాప్ స్కోర్ 41 మాత్రమే.. లక్నో టార్గెట్ ఎంతంటే...

ABN, First Publish Date - 2023-05-24T21:41:01+05:30

ఐపీఎల్-2023లో (IPL2023) క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడాలంటే తప్పక గెలవాల్సిన లక్నో సూపర్ జెయింట్స్‌పై ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ (Lucknow Super Giants vs Mumbai Indians) ఫర్వాలేదనిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఐపీఎల్-2023లో (IPL2023) క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడాలంటే లక్నో సూపర్ జెయింట్స్‌పై తప్పక గెలవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ (Lucknow Super Giants vs Mumbai Indians) ఫర్వాలేదనిపించారు. వ్యక్తిగతంగా ఎవరూ భారీ స్కోర్లు చేయలేకపోయినప్పటికీ ఛాలెంజింగ్ టార్గెట్‌ని నిర్దేశించారు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ఎవరూ వ్యక్తిగతంగా భారీ స్కోర్ చేయలేకపోయ్యారు. అత్యధికంగా కామెరాన్ గ్రీన్ 41 పరుగులు చేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 33, తిలక్ వర్మ 26 మాత్రమే చెప్పుకోగదగ్గ స్కోర్ చేశారు. ఓపెనర్లు ఇషాన్ కిషర్, రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. 30 పరుగుల వద్ద రోహిత్, 38 పరుగుల వద్ద ఇషాన్ రూపంలో ఓపెనర్లు ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్ ఇద్దరూ రాణించారు. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ బోర్డ్‌ని 100కి చేరువ చేశారు. వీరిద్దరూ ఔటయ్యాక స్కోర్ నెమ్మదించడంతో ముంబై 200లకుపైగా పరుగులు చేయలేకపోవడానికి కారణమైంది.

ముంబై బ్యాటింగ్...

ఇషాన్ కిషన్ (15), రోహిత్ శర్మ (11), కామెరాన్ గ్రీన్ (41), సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (26), టిమ్ డేవిడ్ (13), నెహాల్ వధేరా (23), క్రిస్ జోర్డాన్ (4), హృతిక్ షోకిన్ (0 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. యష్ థాకూర్ 3, మొహ్‌సిన్ ఖాన్ 1 చొప్పున వికెట్లు తీశారు.

Updated Date - 2023-05-24T21:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising