Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు మళ్లీ అన్యాయం? టీమిండియా టెస్ట్ టీంలోకి రావాలంటే ఐపీఎల్‌లోనే కొట్టాలా?
ABN, First Publish Date - 2023-06-23T20:01:43+05:30
వెస్టిండీస్ పర్యటనకు సెలెక్టర్లు ఇలా టీమిండియా (Team India) స్క్వాడ్‌ను ప్రకటించారో లేదో ఇంతలోనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు (Sarfaraz Khan) సెలెక్టర్లు మరోసారి మొండి చెయ్యే చూపించడం పట్ల క్రికెట్ ప్రేమికులతోపాటు విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతకాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో (First Class Cricket) అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌ను టీమిండియాలోకి ఎంపిక చేయకపోవడానికి గల కారణమేంటని అభిమానులు నిలదీస్తున్నారు. అంతర్జాతీయ టెస్ట్ ఫార్మా్ట్లోకి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణించిన వారికి కాకుండా ఐపీఎల్‌లో (IPL) రాణించిన వారిని ఎంపిక చేశారని విమర్శిస్తున్నారు.
వెస్టిండీస్ పర్యటనకు సెలెక్టర్లు ఇలా టీమిండియా (Team India) స్క్వాడ్‌ను ప్రకటించారో లేదో ఇంతలోనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు (Sarfaraz Khan) సెలెక్టర్లు మరోసారి మొండి చెయ్యే చూపించడం పట్ల క్రికెట్ ప్రేమికులతోపాటు విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతకాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో (First Class Cricket) అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌ను టీమిండియాలోకి ఎంపిక చేయకపోవడానికి గల కారణమేంటని అభిమానులు నిలదీస్తున్నారు. అంతర్జాతీయ టెస్ట్ ఫార్మా్ట్లోకి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణించిన వారికి కాకుండా ఐపీఎల్‌లో (IPL) రాణించిన వారిని ఎంపిక చేశారని విమర్శిస్తున్నారు. నిజానికి సర్ఫరాజ్ ఖాన్‌కు టీమిండియాలో చోటు దక్కకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం కావడం ఇది కొత్తేం కాదు. ఒక సంవత్సర కాలంగా టెస్ట్ క్రికెట్‌కు టీమిండియా ఎంపిక ఎప్పుడూ జరిగినా సర్ఫరాజ్ ఖాన్ పేరు కచ్చితంగా ట్రెండింగ్‌లో ఉంటుంది. దీనికి కారణం అంతకుముందు జరిగిన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ అదిరిపోయే బ్యాటింగ్‌తో అదరగొట్టడమే. కానీ సెలెక్టర్లు మాత్రం ఎందుకనో కానీ ప్రతిసారి సర్ఫరాజ్‌కు మొండి చేయ్యే చూపిస్తున్నారు. దీంతో సెలెక్టర్లు కావాలనే సర్ఫరాజ్ ఖాన్‌ను టీమిండియాలోకి ఎంపిక చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
తాజాగా వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన టీమిండియాను చూస్తే ఇది నిజమేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయని కొంతమంది చెబుతున్నారు. ఎందుకంటే రంజీల్లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌ను కాదని, వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ఐపీఎల్‌లో రాణించిన ఆటగాళ్లను ఎంపిక చేశారని అంటున్నారు. ఈ సారి టెస్ట్ టీంలో నుంచి పుజారాను తొలగించినప్పటికీ.. సర్పరాజ్ ఖాన్‌కు చోటుదక్కలేదు. గతంలో పుజరారా, రహానేపై వేటు వేసినప్పుడు కూడా అవకాశం దక్కలేదు. పైగా సర్ఫారాజ్‌ని కాదని టెస్ట్ టీంలోకి ఐపీఎల్‌లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj gaikwad), యశస్వి జైస్వాల్‌ను (Yashasvi Jaiswal) ఎంపిక చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటివరకు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. ఏకంగా 79 సగటుతో 3,505 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీ కూడా ఉన్నాయి. వరుసగా 2019-2020, 2020- 2021 సీజన్లలో 900కు పైగా పరుగులు సాధించాడు. ఈ సీజన్ల కూడా ఇప్పటికే 600కు పైగా పరుగులు చేశాడు. ఈ 3 సీజన్లలో సర్ఫరాజ్ సగటు ఏకంగా 100కు పైగా ఉంది. ఈ గణాంకాలను చూస్తే టీమిండియాలో చోటు ఖాయమని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ సర్ఫరాజ్ విషయంలో మాత్రం అది జరగడం లేదు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మిడిలార్డర్‌లో అద్భుతంగా ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్ మాత్రం రాణించలేకపోతున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 22 సగటుతో 585 పరుగులే చేశాడు. ఒకే ఒక సారి హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ సీజన్‌లో మరీ దారుణంగా 4 మ్యాచ్‌ల్లో 13 సగటుతో 53 పరుగులే చేశాడు.
అదే సమయంలో వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా టెస్ట్ జట్టులోకి ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణాంకాలను చూస్తే సర్ఫరాజ్ ఖాన్ కన్నా తక్కువగా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 28 మ్యాచ్‌లాడిన రుతురాజ్ గైక్వాడ్ 42 సగటుతో 1,941 పరుగులే చేశాడు. ఒక్క సారి కూడా డబుల్ సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. యశస్వి జైస్వాల్ విషయానికొస్తే 80 సగటుతో 1845 పరుగులు చేసినప్పటికీ అతనికి 15 మ్యాచ్‌ల అనుభవం మాత్రమే ఉంది. ఏ రకంగా చూసిన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ కన్నా సర్ఫరాజ్ ఖాన్ గణాంకాలే మెరుగ్గా ఉన్నాయి. కానీ రుతురాజ్, జైస్వాల్ ఐపీఎల్‌లో అదరగొడుతున్నారు. ఈ సీజన్లో యశస్వి జైస్వాల్ 48 సగటుతో 625 పరుగులతో.. రుతురాజ్ గైక్వాడ్ 42 సగటుతో 590 పరుగులతో దుమ్ములేపారు. దీనిని బట్టి చూస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్రదర్శనను పక్కనపెట్టి కేవలం ఐపీఎల్ ప్రదర్శన ద్వారానే ఎంపిక జరిగిందని అర్థం చేసుకోవచ్చు. అయితే ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వన్డే, టీ20 జట్టులోకి ఎంపిక చేస్తే పర్వాలేదు కానీ.. టెస్ట్ జట్టులోకి ఎంపిక చేయడమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనా సర్ఫరాజ్ ఖాన్‌కు టీమిండియాలో చోటు దక్కకపోవడం విమర్శలకు తావిస్తోందని చెప్పుకోవాలి. ఇక టీమిండియాలో చోటు కోసం సర్ఫరాజ్ ఖాన్ ఇంకా ఎంత కాలం వేచి చూడాలో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Updated Date - 2023-06-23T20:01:43+05:30 IST