ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కూతురు బౌలింగ్.. స్టార్ క్రికెటర్ బ్యాటింగ్.. ఈ కాంబినేషన్ అదుర్స్!..

ABN, First Publish Date - 2023-07-04T17:17:07+05:30

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (New Zealand Captain Kane Williamson) తన కూతురితో క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం 32 ఏళ్ల విలియమ్సన్ తన చిన్నారి కూతురితో ఇంట్లో క్రికెట్ ఆడుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (New Zealand Captain Kane Williamson) తన కూతురితో క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం 32 ఏళ్ల విలియమ్సన్ తన చిన్నారి కూతురితో ఇంట్లో క్రికెట్ ఆడుతున్నాడు. తన బుల్లి చేతులతో చిన్నారి బౌలింగ్ చేస్తుండగా.. విలియమ్సన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ వీడియోను విలియమ్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. బుల్లి చేతులతో కూతురు వేస్తున్న యార్కర్లను విలియమ్సన్ చక్కగా ఎదుర్కొంటున్నాడని పలువురు కామెంట్స్ చేశారు. మరికొందరేమో విలియమ్సన్ లాగే అతని కూతురు కూడా గొప్ప క్రికెటర్ అవుతుందని అంటున్నారు. కాకపోతే విలియమ్సన్‌లా బ్యాటర్ కాకుండా, బౌలర్‌గా రాణిస్తుందని కొందరు జోస్యం కూడా చెప్పేస్తున్నారు.

కాగా హైదరాబాద్ (Hyderabad) అభిమానులు ముద్దుగా కేన్ మామ అని పిలుచుకునే విలియమ్సన్ గాయం కారణంగా కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. గత ఐపీఎల్‌లో (IPL2023) గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విలియమ్సన్ మొదటి మ్యాచ్‌లోనే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. మోకాలికి తీవ్రమైన గాయం కావడంతో ఆ టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌లో విలియమ్సన్ మోకాలికి శస్త్ర చికిత్స కూడా జరిగింది. దీంతో అతను కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశాలున్నాయి. విలియమ్సన్ స్థానంలో ప్రస్తుతం న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌గా టామ్ లాథమ్ వ్యవహరిస్తున్నాడు. మరోవైపు పని ఒత్తిడి కారణంగా విలియమ్సన్ ఇప్పటికే టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఆ స్థానంలో టిమ్ సౌథీ ఉన్నాడు. అయితే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ వరకు విలియమ్సన్ కోలుకుంటాడని అంతా భావిస్తున్నారు. ప్రపంచకప్‌లో విలియమ్సన్ ఆడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నాయి. కాగా విలియమ్సన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచింది. 2019 వన్డే ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరింది.

Updated Date - 2023-07-04T17:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising