RajastanVsPunjabkings: రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో గెలిచేదెవరో?.. తొలుత బ్యాటింగ్ ఎవరిదంటే..

ABN, First Publish Date - 2023-04-05T19:12:31+05:30

ఐపీఎల్ 2023లో (IPL2023) 8వ మ్యాచ్‌కు తెరలేచింది. అసోంలోని గువహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (Rajasthan Royals vs Punjab Kings) టీమ్స్ తలపడుతున్నాయి. టాస్ ఎవరు గెలిచారంటే..

RajastanVsPunjabkings: రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో గెలిచేదెవరో?.. తొలుత బ్యాటింగ్ ఎవరిదంటే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గువహటి: ఐపీఎల్ 2023లో (IPL2023) 8వ మ్యాచ్‌కు తెరలేచింది. అసోంలోని గువహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (Rajasthan Royals vs Punjab Kings) టీమ్స్ తలపడుతున్నాయి. గువహటి తొలిసారి ఐపీఎల్‌కు ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నట్టు పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ చెప్పాడు. మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్ గెలిచివుంటే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని ధావన్ చెప్పాడు. కాగా ఇరు జట్లు తమ మొదటి మ్యాచ్‌లో గెలిచాయి. రెండో మ్యాచ్‌లో కూడా గెలిచి ఆధిక్యాన్ని పొందాలని ఉవ్విళ్లూరుతున్నాయి.

తుది జట్లు..

రాజస్థాన్ రాయల్స్: యశశ్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), దేవధూత్ పడిక్కల్, షిమ్రోన్ హిట్మేయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్డ్, కేఎం అసిఫ్, యజువేంద్ర చాహల్.

పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, భనుక రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సికందర్ రాజా, షారుక్ ఖాన్, శామ్ కరాన్, నాథన్ ఎల్లీస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్.

Updated Date - 2023-04-05T19:28:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising