ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ind Vs Aus: ఫైనల్ మ్యాచ్‌కు ఐరన్ లెగ్ అంపైర్.. మరీ టీమిండియా పరిస్థితి ఏంటో.. అభిమానుల కలవరపాటు!

ABN, First Publish Date - 2023-11-18T14:11:49+05:30

Ind Vs Aus Final: భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు అంపైర్లను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, రిచర్డ్‌ కెటిల్‌బరో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో (Richard Kettleborough) విషయమే భారతీయ అభిమానులను ఇప్పుడు కలవరపాటుకు గురి చేస్తుంది.

Ind Vs Aus Final: భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు అంపైర్లను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, రిచర్డ్‌ కెటిల్‌బరో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో (Richard Kettleborough) విషయమే భారతీయ అభిమానులను ఇప్పుడు కలవరపాటుకు గురి చేస్తుంది. ఎందుకంటే ఆయన గత ఐసీసీ ఈవెంట్లలో భారత్ ఆడిన నాకౌట్ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించగా.. ఏ మ్యాచ్‌లోనూ టీమిండియా విజయం సాధించలేదు. ఇదే విషయం ఇప్పుడు భారత అభిమానులను భయపెడుతోంది. ఈసారి వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా కెటిల్‌బరో అంపైర్ కావడంతో భారత జట్టు పరిస్థిత ఏంటని? ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇంతకుముందు ఆయన అంపైర్‌గా చేసిన 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో శ్రీలంక చేతిలో టీమిండియా పరాజయం పాలయింది. ఇక్కడి నుంచి భారత్‌కు కెటిల్‌బరో ఐరెన్ లెగ్‌గా మారారు. ఆ తర్వాత 2015 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ ఓడింది. అలాగే 2016 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లోనూ టీమిండియాను వెస్టిండీస్ ఓడించింది. ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్.. ధోనీ సేనను చిత్తు చేసింది. 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను అయితే భారత అభిమానులు అంత త్వరగా మరిచిపోలేరు. మహేంద్రుడి రనౌట్.. జట్టు సభ్యులతో పాటు అభిమానులను కన్నీళ్లను మిగిల్చింది. ఇక చివరగా 2023లో జరిగిన టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఇలా కెటిల్‌బరో టీమిండియా ఆడిన ఏ నాకౌట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేసిన అన్ని ఓటములే ఎదురయ్యాయి. దీంతో ఈసారి వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ పరిస్థితి ఏంటో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్ జరిగే అహ్మదాబాద్ స్టేడియం గత రికార్డులపై ఓ లుక్కేయండి!


Updated Date - 2023-11-18T14:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising