కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Happy Birth Day: ధోని పుట్టిన రోజు సందర్భంగా హృదయాన్ని దోచుకునే పోస్ట్ షేర్ చేసిన రిషబ్ పంత్..!

ABN, First Publish Date - 2023-07-07T15:12:36+05:30

భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు సందర్భంగా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ శుక్రవారం హృదయాన్ని దోచుకునే పోస్ట్‌ ను షేర్ చేశాడు. అర్థరాత్రి దాటాక సోషల్ మీడియాలో ధోనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Happy Birth Day: ధోని పుట్టిన రోజు సందర్భంగా హృదయాన్ని దోచుకునే పోస్ట్ షేర్ చేసిన రిషబ్ పంత్..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్ మాజీ కెప్టెన్(Former India Captain) మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) పుట్టిన రోజు సందర్భంగా భారత వికెట్ కీపర్(India Wicket Keeper) రిషబ్ పంత్ (Rishabh Pant)శుక్రవారం హృదయాన్ని దోచుకునే పోస్ట్‌(Heartfelt Post)ను షేర్ చేశాడు. అర్థరాత్రి దాటాక సోషల్ మీడియాలో ధోనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

తన ఆరాధ్య దైవం ఎంఎస్ ధోని 42వ పెట్టిన రోజు సందర్భంగా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ధోని గత పుట్టిన రోజు వేడుకల్లో తనతో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు కేక్ కట్ చేసి..‘‘ధోని భాయ్ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. మీరు మాకు సమీపంలో లేకున్నా నేను మీకోసం కేక్ కట్ చేస్తున్నాను’’ అని పోస్ట్ చేశాడు.

పంత్‌తోపాటు ఇతర మాజీ క్రికెటర్లు ధోని ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు బాహుబలి అంటూ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పోస్ట్‌ను షేర్ చేసి ధోనికి పుట్టిన రోజు విషెష్ తెలిపాడు. ‘‘నాకు ఇష్టమైన ధోనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అంటూ హార్దిక్ పాండ్యా విష్ చేశాడు. ‘‘ఎల్లప్పుడు మీకు దేవుని ఆశీస్సులు ఉంటాయి ధోని భాయ్’’ అంటూ మహ్మద్ షమీ పోస్ట్ షేర్ చేశాడు.

అదేవిధంగా మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్, యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్ తమకు ఇష్టమైన క్రికెటర్ ధోని బర్త్‌డే సందర్భంగా విషెష్ తెలిపారు.

Updated Date - 2023-07-07T15:12:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising