ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India pace bowler: మహ్మద్ షమీకి షాక్

ABN, First Publish Date - 2023-01-24T07:28:00+05:30

భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి కోల్‌కతా కోర్టు షాక్ ఇచ్చింది...

Mohammed Shami,Hasin Jahan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి కోల్‌కతా కోర్టు షాక్ ఇచ్చింది.(Mohammed Shami) మహమ్మద్ షమీ నుంచి విడిపోయిన భార్య హాసిన్ జహాన్‌కు(Hasin Jahan) నెలవారీ రూ.50,000 భరణం చెల్లించాలని(Pay monthly alimony) కోల్‌కతా కోర్టు ఆదేశించింది.సోమవారం అలీపూర్ కోర్టు న్యాయమూర్తి అనిందిత గంగూలీ ఈ తీర్పును వెలువరించారు.(Court Orders) జహాన్ నాలుగేళ్ల క్రితం షమీపై పలు ఆరోపణలు చేసింది.తనకు నెలకు రూ.10లక్షలు భరణం కింద ఇవ్వాలని హాసిన్ జహాన్ 2018వ సంవత్సరంలో కోర్టులో కేసు వేసింది.

తన వ్యక్తిగత ఖర్చుల కోసం రూ.7 లక్షలు, కుమార్తె పోషణ కోసం రూ.3 లక్షలు కలిపి మొత్తం నెలకు రూ.10 లక్షల భరణం ఇవ్వాలని హాసిన్ జహాన్ డిమాండ్ చేసింది. జహాన్ ఈ తీర్పుపై మరింత చెల్లింపు కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది.షమీపై వ్యభిచారం, గృహహింస ఆరోపణలు చేస్తూ జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో హాసిన్ ఫిర్యాదు చేయడంతో గొడవ మొదలైంది.

జహాన్ ఫిర్యాదు మేరకు షమీపై గృహహింస, హత్యాయత్నం వంటి నాన్ బెయిలబుల్ అభియోగాలు మోపారు.ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామానికి వెళ్లినప్పుడల్లా క్రికెటర్, అతని కుటుంబం తనను హింసించారని హాసిన్ జహాన్ పేర్కొంది.షమీ వేర్వేరు ఫోన్ నంబర్లను ఉపయోగించి తనను ఫోన్‌లో బెదిరిస్తున్నాడని జహాన్ పేర్కొంది.అయితే షమీ జహాన్ వాదనలను ఖండించారు. తనపై ఆరోపణలు అవాస్తవమని, తన పరువు తీసేందుకు జరిగిన కుట్ర అని షమీ పేర్కొన్నారు.

Updated Date - 2023-01-24T07:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising