Shikhar Dhawan: భార్యతో విడిపోవడంపై మౌనం వీడిన శిఖర్ ధావన్
ABN, First Publish Date - 2023-03-26T17:02:13+05:30
భారత క్రికెటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan), అతని భార్య ఆయేషా ముఖర్జీ(Aesha Mukherjee) విడిపోయి కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.
Delhi: భారత క్రికెటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan), అతని భార్య ఆయేషా ముఖర్జీ(Aesha Mukherjee) విడిపోయి కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ జంట విడిపోవడంపై అప్పటి నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై క్రికెటర్ శిఖర్ ధావన్ గానీ అతని భార్య ఆయేషా ముఖర్జీగానీ బహిరంగంగా మాట్లాడలేదు. అయితే ఎట్టకేలకు ఓ ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్ నోరు విప్పాడు. తన భార్య ఆయేషాతో ఎందుకు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారో వివరించారు. అంతేకాదు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే యువకులకు ఒక ముఖ్యమైన సలహా ఇస్తూ 'పునర్వివాహం' అంశంపై కూడా మాట్లాడాడు.
స్పోర్ట్స్ టాక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్ వివాహంలో తాను 'విఫలమయ్యాను' అని అంగీకరించాడు, ఇదినా సొంత నిర్ణయం..తన వైఫల్యానికి ఇతరులను బాధ్యులను చేయనని ధావన్ చెప్పుకొచ్చాడు. అయితే డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ విడాకుల కేసు తుదిదశలో ఉంది. పునర్వివాహంపై అడిగిన ప్రశ్నకు స్పందించిన ధావన్.. పునర్వివాహం అంశాన్ని తోసిపుచ్చనప్పటికీ.. ఆ విషయం మాట్లాడడానికి సమయం కాదని దాటవేశారు. ‘‘ప్రస్తుతం నా విడాకుల కేసు నడుస్తోంది. రేపు నేను తిరిగి వివాహం చేసుకోవాలనుకుంటే సరైన నిర్ణయాలతో ముందుకెళ్తానని’’ ధావన్ చెప్పారు. నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకు తెలుసని ధావన్ సమాధానమిచ్చాడు.
‘‘మొదటిసారి ప్రేమలో పడ్డప్పుడు ఒడుదుడుకులను నేను అంచనా వేయలేదు.. ఈసారి ప్రేమలో పడితే సరైనా అంచనాలతో ముందుకెళ్తానని’’ అన్నారాయన. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే యువకులు దానికి సంబంధించిన అనుభవం కలిగి ఉండడం ముఖ్యం. భావోద్యేగపూరిత నిర్ణయాలతో తొందరపడి పెళ్లి చేసుకోవద్దని ధావన్ సలహా ఇచ్చాడు. కాబోయే భాగస్వామిని అర్థం చేసుకోవడంతోపాటు, సంస్కృతులు సరిపోతున్నాయో లేదో కూడా చూడాలని అప్పుడే వైవాహిక జీవితం సాఫీగా ఉంటుందని డాషింగ్ క్రికెటర్ శిఖర్ ధావన్ యువతకు సూచించారు.
దీంతోపాటు పెళ్లి విషయంలో డైనమిక్ క్రికెటర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పెళ్లి కూడా ఒక మ్యాచ్ లాంటిదని.. కొందరికి 4-5 సంబంధాలు అవసరం కావచ్చు.. మరికొందరికి విషయాలను గుర్తించడానికి 8-9 పట్టవచ్చు. అందులో చెడు ఏమీలేదన్నారు. మీరు దాని నుండి నేర్చుకుంటారు. మీరు వివాహంపై నిర్ణయం తీసుకున్నప్పుడు, మీరు కొంత అనుభవం ఉంది." అని అతను క్రికెట్‌తో పోలుస్తూ అంశాన్ని చెప్పాడు.
Updated Date - 2023-03-26T17:09:11+05:30 IST