Ahmedabad test: మ్యాచ్ మధ్యలోనే శ్రేయస్ అయ్యర్‌ను హాస్పిటల్‌కు తరలించిన మేనేజ్‌మెంట్.. కారణం ఇదే..
ABN, First Publish Date - 2023-03-12T16:02:10+05:30
బోర్డర్-గవాస్కర్ ట్రోపీలో (border gavaskar trophy) భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాంటింగ్ లైనస్‌కు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది...
అహ్మదాబాద్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో (border gavaskar trophy) భాగంగా అహ్మదాబాద్ వేదికగా (Ahmedabad test) జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాంటింగ్ లైనస్‌కు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయర్ అయ్యర్ (Shreyas Iyer) వెన్నునొప్పికి గురయ్యాడు. బాధ ఎక్కువగా ఉండడంతో శుక్రవారం ఉదయం కూడా బ్యాటింగ్‌కు దిగలేదు. ఇదే కారణంతో మూడవ రోజు కూడా బ్యాటింగ్‌కు దిగకపోవడంతో రవీంద్ర జడేజాను ముందుగా బ్యాంటింగ్‌కు దింపాల్సి వచ్చింది. జడేజా ఔటయ్యిన తర్వాత కూడా అయ్యర్ క్రీజులోకి రాకపోవడం... 6వ స్థానంలో వికెట్ కీపర్ కేఎస్ భరత్ క్రీజులోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అయ్యర్ వెన్నునొప్పే కారణమని టీమిండియా మేనేజ్‌మెంట్ తెలిపింది. స్కానింగ్ కోసం అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లామని, బీసీసీఐ మెడికల్ టీమ్ అతణ్ణి పర్యవేక్షిస్తోందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ మ్యాచ్‌లో అయ్యర్ బ్యాటింగ్ చేయడంపై స్పష్టతనివ్వలేదు.
కాగా శ్రేయస్ అయ్యర్ గాయం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. కొన్నివారాల క్రితం వరకు అయ్యర్ గాయాలతో ఇబ్బందిపడ్డారు. బార్డర్-గవాస్కర్ ట్రోపీ మొదటి టెస్ట్‌తోపాటు న్యూజిలాండ్‌పై వన్డే సీరిస్‌లో కూడా ఆడని విషయం తెలిసిందే.
Updated Date - 2023-03-12T16:03:46+05:30 IST