WTC final: చరిత్రాత్మక మ్యాచ్‌లో స్మిత్ సెంచరీ.. రెండో రోజు ఆరంభంలోనే 2 వికెట్లు...
ABN, First Publish Date - 2023-06-08T15:46:49+05:30
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య (India vs Australia) డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC final) మ్యాచ్ రెండవ రోజు ఆట మొదలైంది. ఓవర్ నైట్ స్కోరు 327/3 వద్ద ఆసీస్ బ్యాటింగ్ ఆరంభించింది. ఓవర్ నైట్ స్కోరు 95 పరుగులతో క్రీజులో అడుగుపెట్టిన స్టార్‌బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ (steev smith) సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఓవల్ : భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య (India vs Australia) డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC final) మ్యాచ్ రెండవ రోజు ఆట మొదలైంది. ఓవర్ నైట్ స్కోరు 327/3 వద్ద ఆసీస్ బ్యాటింగ్ ఆరంభించింది. ఓవర్ నైట్ స్కోరు 95 పరుగులతో క్రీజులో అడుగుపెట్టిన స్టార్‌బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ (steev smith) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. కెరీర్‌లో 31వ టెస్ట్ శతకాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీతో ఇండియాపై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో జో రూట్ సరసన స్మిత్ చేరాడు. జో రూట్, స్మిత్ భారత్‌పై చెరో 9 టెస్ట్ సెంచరీలు కొట్టారు. ఇక ఇంగ్లండ్‌లో పర్యటక ఆటగాడిగా స్మిత్‌కు ఇది 7వ సెంచరీగా ఉంది.
మరోవైపు ఓవర్ నైట్ స్కోరు 146 పరుగులతో క్రీజులోకి దిగిన ట్రావిడ్ హెడ్ 163 పరుగులు చేశాక ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో కీపర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కామెరూన్ గ్రీన్ క్రీజులోకి అడుగుపెట్టాడు. అయితే స్వల్ప స్కోరు 6 పరుగులకే మహ్మద్ షమీ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో రెండో రోజు ఆరంభంలోనే 2 వికెట్లు పడినట్టయ్యింది. కాగా ప్రస్తుతం 93 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 368/5గా ఉంది.
Updated Date - 2023-06-08T15:50:17+05:30 IST