ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Praggnanandaa: యువ సంచలనం ప్రజ్ఞానందకు మరో బంపర్ ఆఫర్.. రూ.30 లక్షలు ఇచ్చిన సీఎం

ABN, First Publish Date - 2023-08-30T20:02:51+05:30

ప్రపంచకప్ చెస్ టోర్నీని ముగించుకుని స్వదేశానికి వచ్చిన ప్రజ్ఞానందకు చెన్నై విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రజ్ఞానంద నేరుగా తన కుటుంబసభ్యులతో కలిసి తమిళనాడు సీఎం స్టాలిన్‌ నివాసానికి వెళ్లాడు. తమిళనాడుతో పాటు యావత్‌ దేశం గర్వించేలా గొప్ప ప్రదర్శన చేసినందుకు సీఎం ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా ప్రోత్సాహకంగా రూ.30 లక్షల చెక్కు అందించి మెమెంటోను బహూకరించారు.

తమిళనాడులోని చెన్నైకు చెందిన 18 ఏళ్ల రమేష్‌బాబు ప్రజ్ఞానంద ఇటీవల ముగిసిన ప్రపంచకప్ చెస్ టోర్నీలో అదరగొట్టాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఏకంగా ఫైనల్‌కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫైనల్లో కూడా అగ్రశ్రేణి ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌కు చెమటలు పట్టించాడు. టై బ్రేక్‌లో ఒత్తిడికి గురికావడంతో ప్రజ్ఞానంద రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత చెస్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరిన రెండో భారత గ్రాండ్‌మాస్టర్‌గా ప్రజ్ఞానంద రికార్డు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలో అతడికి పలువురు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మహింద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహింద్రా ఎలక్ట్రిక్ కారును బహుమతిగా అందిస్తానని ప్రకటించారు. ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ ఏకంగా రూ.30 లక్షల చెక్కును బహుమతిగా అందజేశారు.

ప్రపంచకప్ చెస్ టోర్నీని ముగించుకుని స్వదేశానికి వచ్చిన ప్రజ్ఞానందకు చెన్నై విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రజ్ఞానంద అంటూ నినాదాలు చేయడమే కాకుండా జేజేలు పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రజ్ఞానంద నేరుగా తన కుటుంబసభ్యులతో కలిసి తమిళనాడు సీఎం స్టాలిన్‌ నివాసానికి వెళ్లాడు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందపై సీఎం స్టాలిన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. తమిళనాడుతో పాటు యావత్‌ దేశం గర్వించేలా గొప్ప ప్రదర్శన చేసినందుకు సీఎం ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా ప్రోత్సాహకంగా రూ.30 లక్షల చెక్కు అందించి మెమెంటోను బహూకరించారు. అనంతరం కాసేపు ప్రజ్ఞానంద కుటుంబ సభ్యులతో సీఎం స్టాలిన్ ముచ్చటించారు. మరోవైపు తమిళనాడు యువజన సంక్షేమ, క్రీడాశాఖ అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్‌ కూడా ప్రజ్ఞానందను శాలువాతో సత్కరించారు.

ఇది కూడా చదవండి: Asia Cup 2023: పసికూనపై సెంచరీతో రెచ్చిపోయిన బాబర్ ఆజమ్.. పాకిస్థాన్ భారీ స్కోరు

కాగా చంద్రయాన్‌-3 రాకెట్‌ చంద్రుడిపై అడుగుపెట్టిన రోజే ప్రజ్ఞానంద పేరు విశ్వవ్యాప్తంగా మారుమ్రోగింది. ఆరేళ్లకే అండర్‌-7 ఇండియన్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచి ఆ తర్వాత అండర్‌-8, అండర్‌-10 ప్రపంచ యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిళ్లను ప్రజ్ఞానంద గెలిచాడు. ఆ తర్వాత 10 ఏళ్ల 9 నెలల వయసులో 2016లో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన అంతర్జాతీయ మాస్టర్‌(ఐఎం) ఘనతను అందుకున్నాడు. 2018లో 12 ఏళ్ల 10 నెలల వయసులో రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్‌ తర్వాత గ్రాండ్‌మాస్టర్‌ హోదాను సాధించిన రెండో అతి పిన్న వయస్కుడిగా, భారత తొలి గ్రాండ్‌మాస్టర్‌గా ప్రజ్ఞానంద రికార్డు నెలకొల్పాడు. తాజాగా ప్రపంచకప్‌ చెస్‌ రన్నరప్‌గా నిలిచి తొలి అతి పిన్న వయస్కుడిగా చెస్‌ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు.

Updated Date - 2023-08-30T20:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising