Home » Praggnanandhaa
18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద(Praggnanandhaa) మళ్లీ అదరగొట్టాడు. నార్వే(Norway) చెస్(chess) టోర్నమెంట్‌లో ఐదో రౌండ్ క్లాసికల్ చెస్(classical chess)లో ప్రపంచ నంబర్ 2 ప్లేయర్ ఫాబియానో కరువానాను ఓడించి వావ్ అనిపించుకున్నాడు.
నార్వేలో 12వ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్(Norway Chess tournament) 2024 జరుగుతోంది. ఈ సందర్భంగా జరిగిన గేమ్ మూడో రౌండ్‌లో భారతీయ కుర్రాడు ఆర్ ప్రజ్ఞానంద(R Praggnanandhaa) అదరకొట్టాడు. క్లాసికల్ రేటింగ్ గేమ్‌లో మొదటిసారిగా ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నార్వేకు చెందిన కార్ల్‌సన్‌ను చిత్తుగా ఓడించాడు.
ప్రపంచకప్ చెస్ టోర్నీని ముగించుకుని స్వదేశానికి వచ్చిన ప్రజ్ఞానందకు చెన్నై విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రజ్ఞానంద నేరుగా తన కుటుంబసభ్యులతో కలిసి తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లాడు. తమిళనాడుతో పాటు యావత్ దేశం గర్వించేలా గొప్ప ప్రదర్శన చేసినందుకు సీఎం ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా ప్రోత్సాహకంగా రూ.30 లక్షల చెక్కు అందించి మెమెంటోను బహూకరించారు.
ప్రపంచకప్ చెస్ టోర్నీలో రాణించిన ప్రజ్ఞానందకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ప్రకటించారు. అతడి తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇస్తానని తెలిపారు. పిల్లలకు చెస్‌పై ఆసక్తి పెంచేలా పేరేంట్స్ అందరూ ప్రోత్సహించాలని.. విద్యుత్ వాహనాల మాదిరిగానే ఇది కూడా పిల్లల భవిష్యత్‌కు మంచి పెట్టుబడి అని పేర్కొన్నారు.
చెస్ ప్రపంచకప్ ఛాంపియన్‌గా మరోసారి వరల్డ్ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ నిలిచాడు. హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్‌లో ప్రజ్ఞానంద తొలి గేమ్ కోల్పోయి, రెండో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఫలితంగా నార్వే ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ విజేతగా నిలిచాడు.