ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ravindra Jadeja: కపిల్ దేవ్‌కు జడేజా స్ట్రాంగ్ కౌంటర్.. మాజీ కెప్టెన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఏమన్నాడంటే..?

ABN, First Publish Date - 2023-08-01T15:34:45+05:30

భారత ఆటగాళ్లను ఉద్దేశించి మాజీ కెప్టెన్ కపీల్ దేవ్ చేసిన వ్యాఖ్యలకు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుత భారత ఆటగాళ్లకు డబ్బు కారణంగా అహంకారం వచ్చిందని కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలను జడేజా కొట్టిపారేశాడు. వెస్టిండీస్‌తో మూడో వన్డే మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జడేజాను విలేకరులు కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు.

భారత ఆటగాళ్లను ఉద్దేశించి మాజీ కెప్టెన్ కపీల్ దేవ్ చేసిన వ్యాఖ్యలకు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుత భారత ఆటగాళ్లకు డబ్బు కారణంగా అహంకారం వచ్చిందని కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలను జడేజా కొట్టిపారేశాడు. వెస్టిండీస్‌తో మూడో వన్డే మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జడేజాను విలేకరులు కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు. ‘‘కపిల్ దేవ్ ఆ వ్యాఖ్యలు ఎప్పుడు చేశాడో నాకు తెలియదు. నేను ఇలాంటి విషయాలను సోషల్ మీడియాలో సెర్చ్ చేయను. ప్రతి ఒక్కరికి వారి స్వంత అభిప్రాయం ఉంటుంది. అలాగే కపిల్ దేవ్‌కు కూడా ఆయన అభిప్రాయన్ని పంచుకోవడానికి పూర్తి హక్కు ఉంది. కానీ ఆయన చెప్పినట్టుగా టీమిండియా ఆటగాళ్లలో ఎలాంటి అహంకారం లేదు. ప్రతి ఒక్కరూ తమ క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా 100 శాతం ఎఫెక్టు పెట్టి టీమిండియాను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా భారత జట్టు ఓడిపోయినప్పుడు ఇలాంటి విమర్శలు సహజం. ప్రస్తుతం జట్టు ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండి ఉంది. మేము టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాము. మా ప్రధాన లక్ష్యం జట్టును గెలిపించడమే. మాకు వ్యక్తిగత ఎజెండాలంటూ ఏమీ లేవు" అని జడ్డూ వివరించాడు. మొత్తంగా కపిల్‌దేవ్ చేసిన వ్యాఖ్యలను జడేజా పూర్తిగా ఖండించాడు.


కాగా ప్రస్తుత భారత ఆటగాళ్లకు డబ్బు, అహంకారం పెరిగిపోయిందని తమకు అన్నీ తెలుసనే భావనలో ఉంటారని ఇటీవల కపిల్ దేవ్ సంచలన ఆరోపణలు చేశారు. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాడు మైదానంలో ఉన్నప్పుడు కూడా ఆయనతో టీమిండియా ఆటగాళ్లు మాట్లాడరంటూ మండిపడ్డారు. ఇక రెండో వన్డే మ్యాచ్‌లో జట్టు కూర్పు, టీమిండియా ఓటమిపై కూడా జడ్డూ స్పందించాడు. వన్డే ప్రపంచకప్, ఆసియా కప్‌నకు టీమిండియాకు ఉన్న చివరి వన్డే సిరీస్ ఇదేనని అన్నాడు. అందుకే ఈ సిరీస్‌ను ప్రయోగాలకు వేదికగా చేసుకోవాల్సి వచ్చిందని, బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో మార్పులు చేశామని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ప్రపంచకప్‌లో ప్రయోగాలు చేసే అవాకాశం ఉండదు కదా అన్నాడు. అలాంటి సమయంలో మ్యాచ్ ఓడిపోయినా నష్టం ఏమీ ఉండదని, మెగా టోర్నీల్లో ఎలాంటి కాంబినేషన్‌తో వెళ్లాలనే దానిపై ఓ స్పష్టత వస్తుందని జడేజా చెప్పుకొచ్చాడు.

Updated Date - 2023-08-01T15:38:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising