Team India : రోహిత్ సేన సంబరాలు ఇలా..
ABN , First Publish Date - 2023-10-16T02:59:16+05:30 IST
పాకిస్థాన్‌పై విజయం తర్వాత టీమిండియా చిన్నపాటి సంబరాలు చేసుకొంది. మళ్లీ వచ్చే గురువారం మ్యాచ్ ఉండడంతో.. శనివారం రాత్రి హోటల్‌లో భారీ సైజులో ఉన్న
అహ్మదాబాద్: పాకిస్థాన్‌పై విజయం తర్వాత టీమిండియా చిన్నపాటి సంబరాలు చేసుకొంది. మళ్లీ వచ్చే గురువారం మ్యాచ్ ఉండడంతో.. శనివారం రాత్రి హోటల్‌లో భారీ సైజులో ఉన్న కేక్‌ను కట్ చేసి ఆటగాళ్లు పార్టీ చేసుకొన్నారు. ఈ సందర్భంగా టీమ్ సభ్యులతోపాటు సహాయ సిబ్బందికి స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేసినట్టు బీసీసీఐ అధికారి తెలిపారు. నచ్చిన మ్యూజిక్ పెట్టుకోవడంతోపాటు ఒకరిపై ఒకరు జోక్‌లు వేసుకొంటూ జట్టు సభ్యులంతా సరదాగా గడిపినట్టు చెప్పారు. అయితే, ఈ మ్యాచ్‌తోనే అంతా అయిపోలేదని.. సెమీ్‌సకు ముందు ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉందన్న విషయాన్ని ఎవరూ విస్మరించలేదన్నారు.
రాహుల్‌కు ‘ఫీల్డింగ్’ మెడల్
వరల్డ్‌క్‌పలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్థాయికి తగ్గట్టుగా ఫీల్డింగ్ చేసింది. ఇక, వికెట్ల వెనుక కీపర్ కేఎల్ రాహుల్ ఎంతో సమర్థంగా వ్యవహరించాడు. హార్దిక్ బౌలింగ్‌లో ఇమాముల్ క్యాచ్‌ను చక్కగా అందుకోవడమే కాకుండా.. స్పిన్నర్ల బౌలింగ్‌లో లెగ్ సైడ్‌వైపు కాచుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో.. కొత్తగా ప్రవేశ పెట్టిన సంప్రదాయం ప్రకారం ఈ మ్యాచ్‌లో బెస్ట్ ఫీల్డర్‌గా కేఎల్ రాహుల్ పేరును ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రకటించాడు. గత మ్యాచ్‌లో ఈ అవార్డు కింద గోల్డ్ మెడల్ అందుకున్న శార్దూల్.. రాహుల్‌కు పతకాన్ని అందజేశాడు. ’