Team India Wins ODI :కుల్దీప్, జడేజా కూల్చేశారు
ABN, First Publish Date - 2023-07-28T03:34:36+05:30
టెస్టు సిరీస్(Test series) మాదిరిగానే వన్డేల్లోనూ(ODI) టీమిండియా(Team India ) శుభారంభం చేసింది. అటు ఫార్మాట్ మారినా విండీస్(Windies) ఆటతీరు మాత్రం ఎప్పటిలాగే సాగింది.
తొలి వన్డేలో విండీస్‌పై భారత్ విజయం
బ్రిడ్జిటౌన్: టెస్టు సిరీస్(Test series) మాదిరిగానే వన్డేల్లోనూ(ODI) టీమిండియా(Team India ) శుభారంభం చేసింది. అటు ఫార్మాట్ మారినా విండీస్(Windies) ఆటతీరు మాత్రం ఎప్పటిలాగే సాగింది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3-2-6-4), జడేజా (3/37) ఆతిథ్య జట్టును బెంబేలెత్తించారు. ఫలితంగా గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్‌కు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. అయితే స్వల్ప స్కోరును ఛేదించే క్రమంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ కూడా కాస్త తడబడినా.. చివరకు 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా సిరీ్‌సలో 1-0తో ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 23 ఓవర్లలో 114 పరుగులు చేసింది. కెప్టెన్ షాయ్ హోప్ (43), అథనజె (22) మాత్రమే ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఛేదనలో భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసి గెలిచింది. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 52) అర్ధసెంచరీ సాధించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కుల్దీప్ నిలిచాడు. రెండో వన్డే శనివారం జరుగుతుంది.
ఇషాన్ జోరు:
ఛేదించాల్సింది స్వల్ప స్కోరే కావడంతో కెప్టెన్ రోహిత్(Captain Rohit) తమ బ్యాటింగ్ ఆర్డర్‌లో యువ ఆటగాళ్లను ముందే ఆడించాడు. అయినా విండీస్ స్పిన్నర్లు రాణించడంతో భారత్ కూడా సగం వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఓపెనర్లుగా గిల్ (7), ఇషాన్(Ishaan) బరిలోకి దిగారు. అయితే 18 పరుగుల వద్దే గిల్ అవుటయ్యాడు. ఓవైపు ఇషాన్ దూకుడు కనబర్చగా.. మరో ఎండ్‌లో స్వల్ప వ్యవధిలో సూర్యకుమార్ (19), హార్దిక్ (5) వెనుదిరిగారు. 12వ ఓవర్‌లో రెండు ఫోర్లు, 14వ ఓవర్‌లో సిక్సర్ బాదిన ఇషాన్ 44 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే తర్వాతి ఓవర్‌లోనే పావెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి భారత్ విజయానికి మరో 21 పరుగుల దూరంలో ఉంది. శార్దూల్ (1) కూడా నిరాశపర్చగా.. రోహిత్ (12 నాటౌట్) ఏడో నెంబర్ బ్యాటర్‌గా రాక తప్పలేదు. ఈ దశలో మరో వికెట్ కోల్పోకుండా జడేజా (16 నాటౌట్), రోహిత్ చెరో ఫోర్‌తో మరో 163 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించారు.
స్పిన్నర్ల హవా:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆటతీరు మరీ పసికూన జట్టులా సాగింది. మూడో ఓవర్ నుంచే వికెట్ల పతనం కొనసాగగా కనీసం సగం ఓవర్లు కూడా ఆడలేకపోయింది. కెప్టెన్ షాయ్ హోప్ మాత్రమే క్రీజులో నిలువగా.. అథనజె ఉన్నది కాసేపైనా వేగం చూపాడు. ఇక 19వ ఓవర్‌లో బంతి చేతపట్టిన స్పిన్నర్ కుల్దీప్ వేసింది మూడు ఓవర్లే అయినా నాలుగు వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు. అటు జడేజా మూడు వికెట్లతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ముందుగా ఓపెనర్ మేయర్స్ (2)ను హార్దిక్ అవుట్ చేయగా.. బ్రాండన్ కింగ్ (17), అథనజె కలిసి రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో అథనజె జోరు ప్రదర్శించాడు. కానీ అతడిని పేసర్ ముకేశ్ దెబ్బతీసి కెరీర్‌లో తొలి వికెట్ సాధించాడు.
కింగ్‌ను శార్దూల్ అవుట్ చేయడంతో 45 పరుగుల వద్దే విండీస్ ఈ రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం హోప్, హెట్‌మయెర్ జోడీ కాస్త ఆశలు రేపింది. అయితే 16వ ఓవర్ నుంచి అంతా స్పిన్నర్ల హవా ఆరంభమైంది. అటు జడేజా.. ఇటు కుల్దీప్ విండీ్‌సను శాసించారు. దీంతో నాలుగో వికెట్‌కు 43 పరుగులు జత చేరాక హెట్‌మయెర్‌ను జడ్డూ బౌల్ట్ చేశాడు. తన తర్వాతి ఓవర్‌లోనే పావెల్ (4), షెపర్డ్ (0)లను పెవిలియన్‌కు చేర్చడంతో 96 రన్స్‌కే విండీస్ ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక ఆ తర్వాత 15 పరుగుల వ్యవధిలోనే కుల్దీప్ మిగిలిన నాలుగు వికెట్లను తీయడంతో ఆతిథ్య జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
స్కోరుబోర్డు
వెస్టిండీస్:
బ్రాండన్ కింగ్ (బి) శార్దూల్ 17, మేయర్స్ (సి) రోహిత్ (బి) హార్దిక్ 2, అథనజె (సి) జడేజా (బి) ముకేశ్ 22, హోప్ (ఎల్బీ) కుల్దీప్ 43, హెట్‌మయెర్ (బి) జడేజా 11, పావెల్ (సి) గిల్ (బి) జడేజా 4, షెపర్డ్ (సి) కోహ్లీ (బి) జడేజా 0, డొమినిక్ డ్రేక్స్ (ఎల్బీ) కుల్దీప్ 3, యామిక్ కేరియా (ఎల్బీ) కుల్దీప్ 3, గుడకేశ్ మోటీ (నాటౌట్) 0, జేడన్ సీల్స్ (సి) హార్దిక్ (బి) కుల్దీప్ 0, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 23 ఓవర్లలో 114 ఆలౌట్; వికెట్ల పతనం: 1-7, 2-45, 3-45, 4-88, 5-96, 6-96, 7-99, 8-107, 9-114, 10-114; బౌలింగ్: హార్దిక్ పాండ్యా 3-0-17-1, ముకేశ్ కుమార్ 5-1-22-1, శార్దూల్ 3-1-14-1, జడేజా 6-0-37-3, ఉమ్రాన్ 3-0-17-0, కుల్దీప్ 3-2-6-4.
భారత్:
ఇషాన్ కిషన్ (సి) పావెల్ (బి) మోటీ 52, గిల్ (సి) కింగ్ (బి) సీల్స్ 7, సూర్యకుమార్ (ఎల్బీ) మోటీ 19, హార్దిక్ (రనౌట్) 5, జడేజా (నాటౌట్) 16, శార్దూల్ (సి) అథనజె (బి) కేరియా 1, రోహిత్ (నాటౌట్) 12, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 22.5 ఓవర్లలో 118/5; వికెట్ల పతనం: 1-18, 2-54, 3-70, 4-94, 5-97; బౌలింగ్: డ్రేక్స్ 4-0-19-0, సీల్స్ 4-0-21-1, మేయర్స్ 1-0-6-0, షెపర్డ్ 1-0-2-0, మోటీ 6.5-0-26-2, కేరియా 5-0-35-1, అథనజె 1-0-7-0.
Updated Date - 2023-07-28T05:08:18+05:30 IST