ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs NewZealand: బాదుడే బాదుడు.. సెంచరీలు చేసిన ఓపెనర్లు రోహిత్, గిల్..

ABN, First Publish Date - 2023-01-24T15:34:28+05:30

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (India vs New Zealand) మధ్య ఇండోర్ (Indore) వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్ దూకుడుగా ఆడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (India vs New Zealand) మధ్య ఇండోర్ (Indore) వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్ దూకుడుగా ఆడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టుకు ఓపెనర్లు చుక్కలు చూపించారు. రోహిత్ శర్మ (Rohit Sharma (c), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఇద్దరూ సెంచరీలు (Centuries) పూర్తి చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో శతకం బాదాడు. ఇక శుభ్‌మన్ గిల్ 72 బంతుల్లో 4 సిక్సర్లు, 13 ఫోర్ల సాయంతో 103 పరుగులతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత ఇద్దరూ వెంటవెంటనే ఔటయ్యారు. జట్టు స్కోరు 212 పరుగుల వద్ద మిచెల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక వ్యక్తిగత స్కోరు 112 పరుగుల వద్ద టిక్నర్ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ ఉన్నారు. 28.3 ఓవర్ల వద్ద జట్టు స్కోరు 231-2గా ఉంది. కాగా ఆట ఆరంభం నుంచి ఇరువురూ చెలరేగి ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సర్లతో అలరించారు. న్యూజిలాండ్ బౌలర్లకు వికెట్ తీసే అవకాశమే ఇవ్వలేదు. జాకబ్ డఫ్ఫీ, లూకీ ఫెర్గూసన్, బ్లయర్ టిక్నర్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్, మిచెల్ బ్రేస్‌వెల్ బౌలర్లందరినీ బాదారు.

Updated Date - 2023-01-24T16:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising