ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vizag one day Kohli: ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ బ్రేక్ చేయనున్న రికార్డులివే!

ABN, First Publish Date - 2023-03-18T20:06:09+05:30

మూడు మ్యాచ్‌ల ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (IndiaVsAustralia) సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో దృష్టాంతా ఆదివారం వైజాగ్ వేదికగా జరగనున్న రెండో వన్డేపై పడింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: మూడు మ్యాచ్‌ల ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (IndiaVsAustralia) సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో దృష్టాంతా ఆదివారం వైజాగ్ వేదికగా జరగనున్న రెండో వన్డేపై పడింది. విశాఖపట్నంలో కురుస్తున్న భారీ వర్షాలు మ్యాచ్‌పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఒకవేళ మ్యాచ్ సజావుగా సాగి.. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) చెలరేగితే పలు రికార్డులు బ్రేకయ్యే అవకాశాలున్నాయి. మూడేళ్ల తర్వాత టెస్టులో తొలి శతకం నమోదు చేసిన విరాట్ మంచి ఊపుమీద ఉన్నాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే మాజీ దిగ్గజాలైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ నుంచి ఆసీస్ వెటరన్ రికీ పాంటింగ్ వరకు పలువురి రికార్డులను చెరిపివేయనున్నాడు. ఆ రికార్డులు ఏవో ఒకసారి పరిశీలిద్దాం..

- స్వదేశంలో ఆడిన వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆసీస్ మాజీ దిగ్గజం రికీ పాంటింగ్‌ను (5406) విరాట్ కోహ్లీ అధిగమించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 5348 పరుగులతో ఉన్న కోహ్లీ మరో 48 పరుగులు సాధిస్తే పాంటింగ్‌ను అధిగమించనున్నాడు. కాగా ఈ జాబితాలో సచిన్ తెందుల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

- మరోవైపు వన్డేల్లో వేగంగా 13 వేల పరుగులు చేరుకోనున్న బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలవబోతున్నాడు. విరాట్ మరో 191 పరుగులు చేస్తే వన్డేల్లో 13 వేల మైలురాయిని చేరుకోనున్నాడు. సచిన్ కంటే ముందు కోహ్లీ ఈ రికార్డును చేరుకోబోతున్నాడు. ఈ జాబితాలో ఐదవ ఆటగాడిగా నిలవనున్నాడు.

- ఇక వన్డేల్లో ఆస్ట్రేలియాపై సచిన్ తెందుల్కర్ అత్యధికంగా 9 సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో ప్రస్తుతం 8 సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇంకొక్క శతకం బాదితే సచిన్‌తో సరిసమానంగా నిలవనున్నాడు.

ఇక ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీకి కళ్లు చెదిరే రికార్డులున్నాయి. ఆసీస్‌పై మొత్తం 43 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 54.81 సగటుతో మొత్తం 2083 పరుగులు కొట్టాడు. ఇందులో 8 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇదిలావుండగా మార్చి 17న ముంబై వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ విఫలమైనప్పటికీ వన్డేల్లో ప్రస్తుతం చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. ఒకవేళ మిగతా రెండు మ్యాచుల్లో రాణిస్తే పలు రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-03-18T20:07:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising